• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'భార‌తీయుడు 3' వస్తోంది.....

'భార‌తీయుడు 3' వస్తోంది.. చూస్తారా చూడరా? సోషల్ మీడియాలో బిగ్ డిబేట్!

| అయితే ఒక ప్లాప్ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూడో భాగాన్ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

By - Sivaji Kontham
Update: 2026-09-11 02:00 GMT

అగ్ర ద‌ర్శ‌కుడు శంకర్- విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన భార‌తీయుడు 2 (ఇండియన్ 2) బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా.. ఇంకా శంక‌ర్ కి `ఇండియన్ 3` ఆశ‌లు సజీవంగానే ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారని స‌మాచారం. శంక‌ర్ స‌ర్వం సిద్ధం చేస్తే, కమల్ హాసన్ కూడా ఈ సినిమా కోసం పూర్తి సహకారం అందిస్తానని మాట ఇచ్చారట. నిజానికి అసలు కథ, భావోద్వేగాలు మొత్తం `ఇండియన్ 3`లోనే ఉంటాయని శంకర్ టీమ్ చెబుతోంది. అయితే ఒక ప్లాప్ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూడో భాగాన్ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

ఈ క్రమంలోనే సోష‌ల్ మీడియాల్లో నెటిజన్లు ఈ సీక్వెల్ ప్రకటనలపై తమదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తేడాలేకుండా ఎలాగైనా `ఇండియన్ 4` కూడా తీసేస్తారంటూ ఒక నెటిజన్ భారీ సెటైర్ వేశారు. దానికి తోడు.. అంతా అయ్యాక టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ `దిల్ రాజు` (హార్ట్ కింగ్) అప్పుడే ఆ సినిమా హక్కులు కొనడానికి రెడీగా ఉంటారంటూ కామెంట్లు చేయడం విశేషం.

మామూలుగానే టాలీవుడ్‌లో ఇప్పుడు పార్ట్-2ల ట్రెండ్ నడుస్తోంది. ఇదే ఫ్లోలో పోతే `హరిహర వీరమల్లు 2`, `రాజాసాబ్ 2`, `ది కింగ్‌డమ్ 2` మాత్రమే కాకుండా చివరకు `గుంటూరు కారం 2` కూడా వచ్చేస్తే సరిపోతుందని అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల నిర్మాణ వ్యయం, బడ్జెట్లపై స్పందిస్తూ ``ఇంత మనీ ఉంటే మాకేదో సాయం చేయొచ్చు కదా .. ఇలాంటి సినిమాలు తీసి థియేటర్లలో మాపై విడుదల చేయకండి" అని ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.

అయితే అందరూ నెగెటివ్‌గా మాత్రమే స్పందించడం లేదు. `ఇండియన్ 3` పై కొంతమందిలో భిన్నాభిప్రాయాలు, ఆశలు కూడా ఉన్నాయి. `ఇండియన్ 2` సినిమా నిడివి ఎక్కువ అవ్వడం వల్లే బలవంతంగా రెండు భాగాలుగా విడదీశారని...అందుకే రెండో భాగం అంతగా ఆకట్టుకోలేదని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ `ఇండియన్ 3` టీజర్‌లో చూపించిన బ్రిటిష్ కాలం నాటి `రణబాలి` ఫ్లాష్‌బ్యాక్ కాన్సెప్ట్ - లుక్ చాలా బాగున్నాయని.. అందుకే ఈ సినిమాపై ఇంకా కొద్దిగా అంచనాలు ఉన్నాయని కొందరు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

చివరికి `ఇండియన్ 3`ని ప్రేక్షకులు చూస్తారా చూడరా? అని పెద్ద డిబేట్ పెట్టినా.. దర్శకుడు శంకర్ మార్క్ టేకింగ్‌పై అత‌డి డై హార్డ్ ఫ్యాన్స్‌కు అంతో ఇంతో నమ్మకం ఇంకా ఉందనేది వాస్తవం. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ మ్యాజిక్ జరుగుతుందో.. ఏ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. మరి శంకర్-కమల్ హాసన్‌ల కాంబో ఈ మూడో భాగంతో అయినా గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే!

Tags:    
  • indian3 
  • kamalhaasan 
  • shankar 
  • indian2 
  • indianfranchise 
  • kollywood 
  • tamilcinema 

Similar News

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

Copyright @2026

Powered by Blink CMS