వీకెండ్ సినిమాల టాక్.. ఏంటి పరిస్థితి?
ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు హడావుడి లేని సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. లాంగ్ వీకెండ్ కావడంతో క్లాస్ రూట్లో తమ ప్రాజెక్టులను ఆడియన్స్ ముందుకు తెచ్చారు.
ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు హడావుడి లేని సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. లాంగ్ వీకెండ్ కావడంతో క్లాస్ రూట్లో తమ ప్రాజెక్టులను ఆడియన్స్ ముందుకు తెచ్చారు. మొదటి రోజు వచ్చిన పబ్లిక్ టాక్, అలాగే రివ్యూల ఆధారంగా ఈ వారం రిలీజ్ అయిన సినిమాల బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య హీరోగా నటించిన కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రస్తుతానికి పాజిటివ్ సైడ్‌లో ఉంది. సూర్య నటన, మమితా బైజు క్యారెక్టర్, ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయని మంచి టాక్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ కాస్త స్లోగా ఉండటం, అలాగే రొటీన్ ఫార్ములా టచ్ కనిపించడం లాంటి కంప్లైంట్స్ కూడా ఆడియన్స్ నుంచి వస్తున్నాయి. దీన్ని బట్టి ఇప్పుడే ఫైనల్ రిజల్ట్ చెప్పలేం.
ఉదయ్ చౌహాన్ డైరెక్ట్ చేసిన 'పల్లాబురుసు' సినిమాకు మిక్స్‌డ్ టాక్Head దక్కింది. బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటించారు. వారి మధ్య వచ్చే ఎమోషన్స్, యాక్టింగ్, కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కథనం నెమ్మదిగా సాగడం, మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌లో డెప్త్ పెద్దగా లేకపోవడం లాంటి విషయాల్లో జనం నుంచి మిక్స్‌డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి.
ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన మిస్టికల్ థ్రిల్లర్ 'అగాధ'కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి నటించిన ఈ సినిమాలో విజువల్స్, డార్క్ అట్మాస్ఫియర్, సెకండ్ హాఫ్‌లో వచ్చే హారర్ మూమెంట్స్ బాగున్నా ప్రిడిక్టబుల్ స్క్రీన్‌ప్లే మీద మిక్స్ డ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక అంజలి, దుషారా విజయన్‌తో పాటు విశాల్ లీడ్ చేస్తూ డైరెక్ట్ చేసిన యాక్షన్ డ్రామా 'మకుటం' టాక్ కాస్త వీక్ సైడ్‌లో ఉంది. విశాల్ యాక్షన్, జీవీ ప్రకాష్ బీజీఎమ్ మినహా మిగతా ట్రీట్‌మెంట్ అంతా రొటీన్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పటివరకు థియేటర్లలో ఉన్న ఆడియన్స్‌కు రకరకాల జోనర్లలో ఆప్షన్స్ అయితే దొరికాయి. ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా కోరుకునే వారికి సూర్య సినిమా బెటర్ ఛాయిస్‌గా కనిపిస్తోంది. హారర్, యాక్షన్, ఎమోషనల్ డ్రామాలు అన్నీ ఎక్కువ శాతం డివైడ్ టాక్‌తో నడుస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాలన్నీ ఒక బేసిక్ టాక్‌ను ఇచ్చినా, వీకెండ్ పూర్తయ్యే నాటికి గానీ అసలైన రిజల్ట్ ఏంటనేది క్లియర్ గా తెలియదు.
అయితే ఈ లాంగ్ వీకెండ్ బాక్సాఫీస్ లైన్ ఇక్కడితో ఆగిపోలేదు. బిక్షు కోయగూర డైరెక్షన్‌లో వాసవి గణేశన్, అన్ష్ థోరట్ లీడ్ రోల్స్ లో నటించిన 'హుషార్ పిట్టలు' మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. రేపు ఈ సినిమా కూడా బరిలోకి దిగుతుండటంతో వీకెండ్ రేసులో మరో ఆప్షన్ యాడ్ అవ్వనుంది. ఫైనల్‌గా ఈ వారం బాక్సాఫీస్ రేసును ఏ సినిమా లీడ్ చేస్తుందో చూడాలి.