రెండో బిడ్డ పుట్టినా దాచి పెట్టిన ఇలియానా?

సైలెంట్ గా విదేశీ ప్రియుడు మైఖేల్ డోల‌న్ తో లివిన్ రిలేష‌న్ ప్రారంభించిన‌ ఇలియానా, అత‌డితో ఒక బిడ్డ‌ను కూడా క‌న్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-06-17 09:21 GMT

సైలెంట్ గా విదేశీ ప్రియుడు మైఖేల్ డోల‌న్ తో లివిన్ రిలేష‌న్ ప్రారంభించిన‌ ఇలియానా, అత‌డితో ఒక బిడ్డ‌ను కూడా క‌న్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన కొద్దిరోజుల త‌ర్వాత ఈ విష‌యాన్ని రివీల్ చేసింది. అప్ప‌టికి త‌న భ‌ర్త‌ను కూడా ప‌రిచ‌యం చేయ‌కుండా అభిమానుల‌కు స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినా ఆ వివ‌రాలేవీ వెల్ల‌డించ‌కుండా సైలెన్స్ మెయింటెయిన్ చేసింది.

2025 ఫాదర్స్ డే నాడు ఇల్లీ ఇన్‌స్టాలో డోలన్‌కు హృదయపూర్వక నివాళిగా ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోగ్రాఫ్‌లో అతడు ఒక బిడ్డను గోముగా ముద్దాడుతూ క‌నిపించాడు. దీనిని బ‌ట్టి ఇలియానాకు రెండవ బిడ్డ పుట్టి ఉండొచ్చ‌ని నెటిజ‌నులు ఊహాగానాలు సాగిస్తున్నారు. మొన్న ఆదివారం నాడు ఈ న‌వ‌జాత శిషువు ఫోటోగ్రాఫ్ బ‌య‌ట‌ప‌డ‌టంతో అభిమానులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

డాడీ మైఖేల్ బిడ్డ‌ను చేతిలోనే ఊయల ఊపుతూ ముద్దాడుతూ క‌నిపించాడు. ఈ అంద‌మైన అనుబంధానికి సంబంధించిన‌ ఫోటోను షేర్ చేసిన ఇలియానా ఎమోష‌నల్ గా ఇలా రాసింది. ''ఎప్పటికైనా ఉత్తమ వ్యక్తికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీరు ప్రేమించే ఉత్త‌మ తండ్రి. మీ బిడ్డకు అర్హుడైన అత్యంత అద్భుతమైన తండ్రి. తల్లిదండ్రులుగా మారడం చూడటం ఎలా ఉంటుందో మీరు ఏమీ వివరించలేదు'' అని గుంబ‌న‌గా ఒక వ్యాఖ్య‌ను పోస్ట్ చేసింది. మొత్తానికి త‌మ కుటుంబంలోకి ఒక కొత్త జీవి ప్ర‌వేశించిన విష‌యాన్ని ఫాద‌ర్స్ డే నాడు రివీల్ చేసింద‌ని అభిమానులు ఊహాగానాలు సాగిస్తున్నారు.

ఇలియానా గ‌త ఏడాది అక్టోబర్ లో తన రెండవ గర్భధారణను అధికారికంగా ధృవీకరించింది. మొదటి బిడ్డ కోవా ఫీనిక్స్ డోలన్ మొదటి పుట్టినరోజును జరుపుకున్న కొన్ని నెలల తర్వాత ఈ విష‌యాన్ని రివీల్ చేసింది. ఈ మే నెలలో ఇన్‌స్టాలో జరిగిన ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్‌లో పేరెంటింగ్ గురించి ఇలియానా క్లుప్తంగా మాట్లాడారు. క్రూర‌త్వం, దుష్ట‌త్వం అంటే ఏమిటో తెలియ‌కుండా బిడ్డ‌ల్ని పెంచాల‌నే త‌న ఆకాంక్ష‌ను వ్య‌క్త‌ప‌రిచింది.

Tags:    

Similar News