• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్ద‌య్యాను కాబ‌ట్టి...

పెద్ద‌య్యాను కాబ‌ట్టి అడ‌ల్ట్ సినిమాలే చేస్తా: ఏక్తాక‌పూర్

| మీరంతా ఎక్కువ మాట్లాడినందుకు నా బృందం నన్ను ట్విట్ట‌ర్ నుంచి లాక్ చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ నేను ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చాను..

By - Tupaki Desk
Update: 2023-10-12 04:02 GMT

సోష‌ల్ మీడియాల్లో నెటిజ‌నులు సూటిగా ప్ర‌శ్న‌లు సంధించ‌డంలో ఎప్పుడూ వెన‌కాడరు. స్వేచ్ఛ‌గా ఈ వేదిక‌ల‌పై సెల‌బ్రిటీల‌తో ముచ్చ‌టించేందుకు మొహ‌మాటం అడ్డు రాదు. అలా ఓ రెండు ప్ర‌శ్న‌లు మ‌హిళా నిర్మాత ఏక్తా క‌పూర్ ని సూటిగా తాకాయి. వాటికి ఏక్తా ఇచ్చిన స‌మాధానాలు కూడా అంతే సింపుల్ గా సెటైరిక‌ల్ గా ఉన్నాయి.

నిర్మాత-దర్శకురాలు ఏక్తా కపూర్ అక్టోబర్ 7 (శనివారం నాడు)న‌ ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చారు. త‌న ట్వీట్ లో నెటిజ‌నుల‌కు హెచ్చ‌రిక జారీ చేసారు. ``మీరంతా ఎక్కువ మాట్లాడినందుకు నా బృందం నన్ను ట్విట్ట‌ర్ నుంచి లాక్ చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ నేను ట్విట్టర్‌లోకి తిరిగి వచ్చాను..`` అని తెలిపింది. రీఎంట్రీ సంద‌ర్భంగా ఏక్తా తన ఆన్‌లైన్ ఫాలోవర్ల కోసం `ఆస్క్ మి సెషన్ ను నిర్వ‌హించింది. ఈ సెషన్‌లో ఇటీవల విడుదలైన తన చిత్రం `థ్యాంక్యూ ఫర్ కమింగ్‌` సహా పలు అంశాలపై చర్చించింది.

ఏక్తా కపూర్ అన్ని ప్రశ్నలకు పదునైన చమత్కారమైన సమాధానాలు ఇచ్చారు. ఒక ప్రశ్న ముఖ్యంగా సోషల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. అడల్ట్ చిత్రాలను నిర్మించడం మానుకోవాలని ఓ అభిమాని ఏక్తాను అభ్యర్థించాడు. ``దయచేసి అడల్ట్ సినిమాలు తీయడం ఆపండి`` అంటూ అత‌డు అభ్య‌ర్థించాడు. దానికి జ‌వాబుగా ఏక్తా కపూర్ ఇలా అన్నారు. ``లేదు.. నేను పెద్దయ్యాను.. కాబట్టి నేను అడల్ట్ సినిమాలను తీస్తాను`` అని చెప్పింది. మరో నెటిజ‌న్ వ్యాఖ్యానిస్తూ.. ఏక్తా కపూర్ - కరణ్ జోహార్ మొత్తం దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నారని ఆరోపించారు. ``మీరు కరణ్ జోహార్ మా దేశాన్ని నాశనం చేసారు!`` అని ఆవేద‌న చెందాడు. దానికి ప్రతిస్పందనగా ఏక్త‌..`హ్మ్మ్మ్మ్మ్!` అని జవాబిచ్చారు.

మ‌రో ట్వీట్‌లో ఏక్తా కపూర్ - కరణ్ జోహార్ భారతదేశంలో విడాకుల పెరుగుదలకు కారణమవుతున్నారని వ్యాఖ్యానించారు. ``ఆప్ దోనో కి వాజా సే ఇండియా మే జ్యాదా విడాకులు హోన్ లగే (మీ ఇద్దరి కారణంగా, భారతదేశంలో విడాకుల కేసులు పెరిగాయి) అని వ్యాఖ్యానించ‌గా.. ప్రతిస్పందనగా, ఏక్తా కపూర్ ``హ్మ్మ్మ్మ్మ్మ్ హ్మ్మ్మ్మ్మ్మ్`` అని పునరావృతం చేసింది.

ఏక్తా కపూర్ నిర్మించిన 'థాంక్యూ ఫర్ కమింగ్' గురించి 'ఎక్స్' లో చర్చిస్తూ తన స్నేహితురాలు, దర్శకురాలు రియా కపూర్‌తో తన బంధాన్ని వ్యక్తం చేసింది. ``థాంక్యూ ఫర్ కమింగ్ అనేది పితృస్వామ్యాన్ని ఎత్తి చూప‌కుండానే, ముక్కు కింద కోడి వెంట్రుక‌తో చక్కిలిగింతలు పెట్టే ప్ర‌య‌త్నం`` అని తెలిపారు. పిచ్చి క్రేజీ పార్టనర్ రియా కపూర్ తీసిన ఒక చిన్న పిచ్చి సినిమా. సినిమాపై పిచ్చి ప్రేమ లేదా అలాంటి ఒక వ్య‌వ‌స్థ‌పై అసహనంతో కూడుకున్న‌ కోపం మాత్రమే త‌న‌కు ఉంది!!`` అని ఏక్తా ట్వీట్ చేసింది. రియాకు చెందిన `అనిల్ కపూర్ ఫిల్మ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్‌`తో పాటు థ్యాంక్యూ ఫర్ కమింగ్ కోసం ఏక్తా సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రియా భర్త కరణ్ బూలాని దర్శకత్వం వహించారు. భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ ప్రాజెక్ట్‌లో కుషా కపిల, డాలీ సింగ్, షిబానీ బేడీ, షెహనాజ్ గిల్, కరణ్ కుంద్రా, అనిల్ కపూర్ త‌దిత‌రులు న‌టించారు.

Tags:    
  • Ektakapoor 
  • Thankyouforcoming 
  • Karanjohar 
  • Rheakapoor 
  • Anilkapoor 
  • Bhumipednekar 
  • Kushakapila 
  • Dollysingh 
  • Shibanibedi 
  • Shehnazgill 

Similar News

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS