ఆలియా చీర ధ‌ర తెలిస్తే షాక్ తింటారు!

సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటోలు షేర్ కాగానే, వ్యాఖ్యల విభాగంలో ఆలియాను గొప్ప‌గా అభినందించారు.;

Update: 2023-12-16 04:52 GMT

ఆలియా భట్ ప్ర‌స్తుత పెళ్లిళ్ల సీజ‌న్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. తన సన్నిహితులలో ఒక క్లోజ్ బ‌డ్డీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైంది. వివాహ వేడుకల్లో ఒక ఫంక్షన్ కోసం ఆలియా `లడ్డూ పిల్లా` చీర‌లో త‌ళుక్కుమంది. అభిమానులు ఆలియా సొగసైన చీరందాన్ని ఇష్టపడ్డారు. సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటోలు షేర్ కాగానే, వ్యాఖ్యల విభాగంలో ఆలియాను గొప్ప‌గా అభినందించారు.


అలియా భట్ ఇన్ స్టాలో ఈ చీర లుక్ ని షేర్ చేసి `ఎల్లో దేర్` అని క్యాప్షన్ ఇచ్చింది. `లడ్డూ పిలా` అనే క్యాప్షన్‌తో అలియా తన ఇన్ స్టాలో ఫోటోల కోల్లెజ్‌ను పోస్ట్ చేసింది. అయితే లడ్డూ పిల్లా అంటే ఏమిటీ? అంటే.. ఈ పదం ఒక‌ వైరల్ వీడియో నుండి పుట్టుకొచ్చింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్ స్టైల్ చేసిన ఈ డ్రెప్ డిజైన‌ర్ శారీ లేబుల్ అనవిలా షెల్ఫ్‌ల నుండి ఎంపిక చేసుకున్న‌ది. అభిమానులు అలియా కొత్త‌ రూపాన్ని ఇష్టపడుతుండగా, కొంద‌రు తారలు కూడా అభినందించారు. భూమి పెడ్నేకర్ `అద్భుతం` అని రాశారు. నేహా ధూపియా వావ్ లాగా ఉన్నావ్‌! అని ప్ర‌శంసించ‌గా, ప్రీతి జింటా గుండె ఎమోజీలను పోస్ట్ చేసింది.


అలియా భట్ చీర ధర ఎంత? అంటే.. ఈ చీర అనవిలా ఆమోద్ కలెక్షన్ లేబుల్ నుండి సేక‌రించిన‌ది. దీనిని ఎల్లో బాగ్ ఆర్గాంజా అప్లిక్ చీర అని పిలుస్తారు. దీని ఖ‌రీదు రూ.2,50,000. ఈ చీర‌ పసుపు షేడ్‌లో అందంగా క‌నిపిస్తోంది. ఈ చీర డిజైన్ లో బాగా గ‌మ‌నిస్తే ఊర‌ పిచ్చుకలు, అరటి ఆకులు, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, గోధుమ, బంగారం వంటి మ‌ల్టీ షేడ్స్ డిజైనర్ పువ్వుల అప్లిక్ ఎంబ్రాయిడరీతో చీర‌ను తీర్చిదిద్దారు. డ్రెప్‌లో బోర్డర్‌లలో గోటా పట్టి ఎంబ్రాయిడరీ, పూసల అలంకారాలు, తారు వ‌ర్క్ కూడా ఉన్నాయి. అలియా ఆరు గజాల స్లీవ్‌లెస్ పసుపు-రంగు బ్లౌజ్‌తో విశాలమైన భుజం పట్టీలు, స్వీట్ నెక్‌లైన్, బ్యాక్‌లెస్ డిజైన్‌తో జాకెట్ ని ధరించింది. పెర‌ల్ గ్రీన్ చోకర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, ఉంగరాలు, హై హీల్స్‌తో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది.

Tags:    

Similar News