ఐబొమ్మ రవి సృష్టించిన సంపదల విలువ?
ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్స్ సహా పైరసీ ద్వారా ఏకంగా 100 కోట్లు పైగా సంపాదించాడని విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు.;
దాదాపు 21000 పైరసీ సినిమాలతో అతి పెద్ద డేటా బ్యాంక్ ని సేకరించాడని ఐబొమ్మ రవిపై పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని రవి విచారణలో అంగీకరించారా లేదా అనేది తెలీదు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు కూడా ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని కూడా తెలుస్తోంది. అతడు సర్వర్లతో పని లేకుండా క్లౌడ్ సర్వీస్ ని ఉపయోగించి డేటాను దాచాడని కూడా చెబుతున్నారు.
ఇక ఐబొమ్మ రవి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దర్యాప్తు కూడా సాగుతోంది. ఈ కేసుతో ముడిపడిన బెట్టింగ్ యాప్ లు, హవాలా వ్యవహారాలపైనా ఆరాలు తీస్తున్నారు. అతడి బ్యాంకు ఖాతాల వివరాలను రాబట్టిన అధికారులు 35 ఖాతాలు ఉన్నాయని గుర్తించినట్టు కూడా కథనాలొచ్చాయి. అతడు మారుపేరుతో వేరే రాష్ట్రంలో బ్యాంక్ ఖాతా రన్ చేసినట్టు కూడా కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్స్ సహా పైరసీ ద్వారా ఏకంగా 100 కోట్లు పైగా సంపాదించాడని విచారణ అధికారులు అంచనా వేస్తున్నారు. అతడి బ్యాంక్ ఖాతాలను పరిశీలించాక 30 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు కనుగొన్నారని కథనాలొస్తున్నాయి. మూవీ అనే వర్డ్ పై క్లిక్ చేయగానే మరో 15 యాడ్స్ కు లింక్ అయ్యేలా ఏర్పాటు చేసాడు. తాజా విచారణకు సంబంధించిన వివరాలను మీడియా ముఖంగా సిపి సజ్జనార్ వెల్లడిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
లాయర్ల భిన్న వాదన:
ఐబొమ్మ రవిపై కస్టడీ విచారణ పూర్తయినా మరిన్ని అదనపు కేసులు భనాయించి మరోసారి కస్టడీ కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కొందరు లాయర్లు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ న్యాయసంహిత సెక్షన్ల ప్రకారం ఐబొమ్మ రవి మరో 15 రోజుల్లో దీని నుంచి బయటపడేందుకు ఆస్కారం ఉందని కూడా కొందరు వాదిస్తున్నారు. అయితే ఈకేసు చివరికి ఎన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.
ఎన్ కౌంటర్ చేసేంత తప్పు?
మరోవైపు ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు ఇమ్మడి తన కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులలో ఉందని, అయినా కుమారుడి కోసం డబ్బు సమకూర్చి లాయర్ ని ఏర్పాటు చేస్తానని చెప్పానని తండ్రి అన్నారు. కానీ దానికి ఐబొమ్మ రవి అంగీకరించలేదు. తనకు తెలిసిన లాయర్లు ఉన్నారని చెప్పినట్టు తాజా ఇంటర్వ్యూలో అప్పారావు వెల్లడించారు. తన కుమారుడు చేసినది తప్పు కానీ, ఎన్ కౌంటర్ చేసేంత తప్పు చేసాడా? ఎన్ కౌంటర్ చేయాలని కోరిన నిర్మాతనే ఎన్ కౌంటర్ చేయాలని అప్పారావు ఆవేదన చెందారు.