సినీపరిశ్రమలో డ్ర*గ్స్ బానిసల వెనక నెట్‌వర్క్?
ఇప్పుడు మరోసారి మాలీవుడ్ లో డ్ర*గ్స్ వినియోగం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.;
మలయాళ, తెలుగు చిత్రాలతో పాపులరైన నటుడిపై మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలు రావడం, అతడిని ఎన్సీబీ విచారించేందుకు సిద్ధం కావడంతో ఇప్పుడు మరోసారి మాలీవుడ్ లో డ్ర*గ్స్ వినియోగం గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.
ప్రఖ్యాత మింట్ కథనం ప్రకారం... మాలీవుడ్ లో డ్ర*గ్స్ వినియోగం ఇప్పటిది కాదు. చాలా కాలంగా ఇది కొనసాగుతున్న వ్యవహారమే. డ్ర*గ్స్ వినియోగించే చాలా మంది నటులు అదుపు తప్పి ప్రవర్తించిన ఘటనల్లో అరెస్టులు జరిగాయి. కొందరు చిన్న సాధారణ నటులు, సాంకేతిక నిపుణులను మాత్రమే కాదు.. ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులను కూడా ఈ వ్యవహారంలో విచారించాల్సిన అవసరం ఉందని మింట్ జర్నలిస్ట్ తన కథనంలో పేర్కొన్నారు.
డ్ర*గ్స్ వినియోగించే ఈ నటుడు చాలా సందర్భాలలో యాంకర్లు, సహనటీమణులు, మహిళలతో రెక్లెస్ గా వ్యవహరించాడని కూడా ఈ జర్నలిస్ట్ ఆరోపించడం హాట్ టాపిగ్గా మారింది. ఆన్ లొకేషన్ నటీనటులు మాత్రమే కాదు, కొందరు సాంకేతిక నిపుణులు డ్ర*గ్స్ సేవించడం కనిపించింది. మాలీవుడ్ లో ఇది ఒక భాగం అని కూడా రచయిత వెల్లడించారు. హేమ కమిటీ కూడా ఆన్ లొకేషన్ డ్ర*గ్స్ వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కమిటీ చాలా విషయాలను దర్యాప్తులో కనుగొందని కూడా రాసారు. అయితే ఈ విషయాలన్నీ తెలిసినా కానీ, దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేయలేదని, పరిశ్రమ కూడా మౌనంగా ఉండిపోయిందని సదరు రచయిత సంచలన కథనం వెలువరించడం ఇప్పుడు అన్ని సినీపరిశ్రమల్లో చర్చగా మారింది.
బ్రౌన్ షుగర్, హాష్, ఎండిఎంఏ, ఎల్.ఎస్.డి వంటి పదార్థాల వినియోగం సినీ పరిశ్రమలో పెరుగుతోందనడానికి ఆధారాలున్నాయని, కానీ ఇవేవీ సరఫరా గొలుసు లేకుండా జరిగేవి కాదని కూడా మింట్ జర్నలిస్ట్ తన కథనంలో పేర్కొన్నారు. వీటన్నిటి వెనకా అసలు సొరచేపను కనుగొనాల్సి ఉందని వ్యాఖ్యానించారు.