వార్ 2 రెండో రోజు వసూళ్లు.. హాలిడే బూస్ట్ తో బిగ్ జంప్

మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే, హిందీలో సుమారు రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.;

Update: 2025-08-16 09:34 GMT

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానుల హడావుడితో మొదటి రోజు థియేటర్స్ సందడిగానే కనిపించాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దక్షిణాది రాష్ట్రాల్లో మంచి బజ్ క్రియేట్ చేశారు. ఇక రెండో రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. హిందీ మార్కెట్‌లో యష్ రాజ్ స్వయంగా రిలీజ్ చేస్తుండటంతో సుమారు రూ.175 కోట్ల విలువ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యదేవర నాగవంశీ దాదాపు రూ. 90 కోట్లకు హక్కులు తీసుకున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.19 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ.56 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తంగా వార్ 2 వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.340 కోట్లకు చేరింది.

తొలి రోజు కలెక్షన్స్

మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే, హిందీలో సుమారు రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.19 కోట్ల గ్రాస్ వచ్చింది. తమిళనాడులో 25 లక్షల రూపాయల వరకు మాత్రమే రాబట్టగా, కన్నడలో సగం కోట్లకు తక్కువే వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్‌లోనూ సుమారు రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. దీంతో మొత్తం వరల్డ్ వైడ్ తొలి రోజు కలెక్షన్లు సుమారు రూ.82 కోట్లుగా ట్రేడ్ అంచనా.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు వసూళ్లు

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజూ మంచి రెస్పాన్స్ కనిపించింది. నైజాం, సీడెడ్, ఆంధ్రాలోని ప్రధాన సెంటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగాయి. రెండో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి సుమారు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

హిందీ ఇతర రాష్ట్రాల వసూళ్లు

హిందీ మార్కెట్‌లో హృతిక్ రోషన్ స్టార్ పవర్ కారణంగా రెండో రోజున బిగ్ జంప్ కనిపించింది. ముఖ్యంగా బాంబే, ఢిల్లీ యూపీ సెంటర్లలో బలమైన వసూళ్లు కనిపించాయి. హిందీ వెర్షన్ రెండో రోజున దాదాపు రూ.49 కోట్ల గ్రాస్ వచ్చిందని అంచనా. తమిళనాడులో సుమారు 36 లక్షల రూపాయలు, కన్నడ రాష్ట్రంలో సగం కోట్ల వరకు వసూళ్లు నమోదయ్యాయి. ఓవర్సీస్‌లోనూ రెండో రోజు దాదాపు రూ.15 కోట్ల గ్రాస్ వచ్చిందని టాక్.

రెండో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (అంచనా)

హిందీ: రూ.49.14 కోట్లు

తెలుగు: రూ.11.82 కోట్లు

తమిళం: రూ.0.36 కోట్లు

కన్నడ: రూ.0.54 కోట్లు

ఓవర్సీస్ (అన్ని భాషలు): రూ.18 కోట్లు+

వరల్డ్ వైడ్ టోటల్ (రెండో రోజు): రూ.80 కోట్లు (అంచనా)

రెండు రోజులు కలిపి వరల్డ్ వైడ్ టోటల్: రూ.164 కోట్లు (గ్రాస్ అంచనా)

Tags:    

Similar News