డాక్ట‌ర్లు చెప్పినా విన‌ని మొండి ఘ‌టం!

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ 'వార్ 2' తో గ్రాండ్ గా తెలుగు ఆడియ‌న్స్ ముందుకు రాబోతున్నారు.;

Update: 2025-08-11 07:30 GMT

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్ 'వార్ 2' తో గ్రాండ్ గా తెలుగు ఆడియ‌న్స్ ముందుకు రాబోతున్నారు. హృతిక్ సినిమాలు తెలుగు ఆడియ‌న్స్ కు కొత్తేం కాదు. గ‌తంలోనూ ప‌లు హిదీ అనువాద చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. కానీ 'వార్ 2' మాత్రం హృతిక్ స‌హా తెలుగు ఆడియ‌న్స్ కు ఎంతో ప్ర‌త్యేక‌మైన చిత్రం. ఇందులో యంగ్ టైగ‌ర్ కూడా న‌టించ‌డంతో సినిమా ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతుంది. ఓ తెలుగు హీరోతో హృతిక్ సినిమా చేయ‌డం కూడా ఇదే తొలిసారి. దీంతో హృతిక్ పేరు తెలుగింట పాపుల‌ర్ గా మారింది.

తార‌క్ అభిమానులంతా హృతిక్ ని అంతే అభిమానిస్తున్నారు. నిన్న‌టి రోజున తార‌క్ నా త‌మ్ముడు అంటూ హృతిక్ సంబోధించ‌డం ఫ్యాన్స్ లో మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా ఓ న‌టుడిని త‌మ‌తో క‌లుపుకు పోతే తెలుగు ఆడియన్స్ ఆ స్టార్ ని మరింత‌గా ఆరాదిస్తారు. భాష‌తో సంబంధం లేకుండా అభిమానించ‌డం అన్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల‌కే చెల్లింది. ఆ ర‌కంగా హృతిక్ తెలుగు అభిమానుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారు. ఇక సినిమాలో తార‌క్-హృతిక్ మ‌ధ్య 'నాటు నాటు' రేంజ్ లో ఓ పాట కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో తార‌క్- హృతిక్ క‌లిసి పోటా పోటీగా డాన్స్ చేసారు. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందన్న అంచనాలున్నాయి. ఈ సంద‌ర్భంగా హృతిక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. హృతిక్ రోష‌న్ కాలేజీ రోజుల్లో ఉన్న‌ప్పుడే వెన్ను స‌మ‌స్య‌తో బాధ ప‌డ్డారుట‌. వైద్యులు డాన్స్ చేయ‌కూడ‌ద‌ని సూచించారుట‌. డాన్సు చేస్తే వెన్ను స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారుతుంద‌ని హెచ్చ‌రించారుట‌. అయినా సినిమాల్లోకి రావాలి అన్న ఆలోచ‌న‌తో డాక్ట‌ర్ల మాట‌లు ఎక్క‌డా ప‌ట్టించుకోలేన్నారు హృతిక్.

ఈ విష‌యం డాక్ట‌ర్లకు చెబితే మీ ఇష్టం అని నిర్ణ‌యం హృతిక్ రోష‌న్ కే వ‌దిలేసారుట‌. మ‌రోసారి ఆలోచించు చూడు అన్నారుట‌. అయినా హృతిక్ మ‌న‌సు వెన్ను స‌మ‌స్య కంటే సినిమాలే కోరుకుం దన్నారు. అప్పుడే వెన్ను స‌మ‌స్య ను ఛాలెంజ్ గా తీసుకుని శారీర‌కంగా, మాన‌సికంగా సిద్ద ప‌డిన‌ట్లు తెలిపారు. వెన్ను స‌మ‌స్య నుంచి శాశ్వ‌తంగా కోలుకునే వ్యాయామాలతో త‌న‌ను తాను తీర్చి దిద్దికున్న‌ట్లు తెలిపారు.

Tags:    

Similar News