హృతిక్ కి ఆ సీక్రెట్ చెప్పిన ఎన్టీఆర్ !
హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్న చిత్రం వార్ 2. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.;
హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్న చిత్రం వార్ 2. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తో తనకున్న బంధాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఒక సీక్రెట్ కూడా చెప్పి తనను ఆశ్చర్యపరిచారని, ఆ సీక్రెట్ ను తన నెక్స్ట్ సినిమాలకు అప్లై చేస్తానని కూడా తెలియజేశారు హృతిక్ రోషన్.
ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై హృతిక్ రోషన్ తన స్పీచ్ ను "అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో ప్రారంభించి, అభిమానులలో జోష్ నింపారు. ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ.." మీ అందరికీ తారక్ అన్న.. నాకు మాత్రం తమ్ముడు.. మనం ఒక ఫ్యామిలీ .. చాలా ఏళ్ల క్రితమే నేను హైదరాబాదులో క్రిష్ సినిమా షూటింగ్ చేశాను. అప్పుడు తెలుగు ప్రేక్షకుల ప్రేమను వారి ఆతిథ్యాన్ని స్వీకరించాను. ఇప్పటికీ కూడా నేను ఆ ఆతిథ్యం మరువలేను. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరిగి రావడం మరింత సంతోషంగా ఉంది"..
తారక్ విషయానికి వస్తే.. నేను, తారక్ ఇద్దరం కలిసి కోస్టార్స్ గానే సినిమాను ప్రారంభించాము. కానీ సినిమా షూటింగ్ ముగిశాక మేమిద్దరం రియల్ లైఫ్ బ్రదర్స్ అయిపోయాము. ఈ సినిమా కోసం మేమిద్దరం చాలా కష్టపడి చేశాము. కొన్నిసార్లు గాయపడ్డాం కూడా.. అయితే తారక్ అంత స్ట్రాంగ్ గా ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. పైగా తారక్ అంత స్ట్రాంగ్ గా ఉండడం చూసి.. గాయం తాలూకా నొప్పి నరకం చూపిస్తున్నా.. పంటి కింద ఆ నొప్పిని పెట్టుకొని నేను కూడా చేశాను. ముఖ్యంగా ఎన్టీఆర్ పట్టుదల నాకు స్ఫూర్తినిచ్చింది. తారక్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి అసలు కారణం సినిమా పైన ఉన్న ఇష్టమే అని చెప్పాడు. ఆ సీక్రెట్ రివీల్ చేయడం నన్ను మరింత ఆనందానికి గురి చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే తారక్ వన్ టేక్ ఫైనల్ టేక్ స్టార్.. సెట్స్ లో నేను తారక్ ని చూడడమే కాదు.. అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. 100% ఎఫర్ట్ ఎలా పెట్టాలి అనేది నేర్చుకున్నాను. షార్ట్ అయిపోయిన తర్వాత కూడా కనీసం ఔట్పుట్ కూడా చెక్ చేయడు.
ఎన్టీఆర్ లో గొప్ప నటుడే కాదు మంచి చెఫ్ కూడా ఉన్నాడు. నేను ఆయనతో మరో సినిమా చేయకపోయినా ఎప్పటికీ ఆయన చేతి బిర్యాని రుచి చూస్తూనే ఉండాలి అనుకుంటున్నాను" అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశారు హృతిక్ రోషన్. మొత్తానికి అయితే హృతిక్ రోషన్ తారక్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ చెప్పిన సీక్రెట్స్ తో తన తదుపరిచిత్రాలలో 100% ఎఫర్ట్ పెడతానని కూడా హామీ ఇచ్చారు హృతిక్ రోషన్