ఆస్కార్ బరిలో ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు
ఇండియన్ సినిమాలు మరోసారి ఇంటర్నేషనల్ వేదికపై తన సత్తా చాటాయి. ఇండియన్ సినీ హిస్టరీలో గర్వించదగ్గ నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది.;
ఇండియన్ సినిమాలు మరోసారి ఇంటర్నేషనల్ వేదికపై తన సత్తా చాటాయి. ఇండియన్ సినీ హిస్టరీలో గర్వించదగ్గ నిర్మాణ సంస్థగా ఎదిగిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది. ఈ బ్యానర్ లో రూపొందిన రెండు సినిమాలు ఆస్కార్ అవార్డుల రేసులోకి వచ్చాయి. అవే రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్1 మరియు మహావతార్ నరసింహా సినిమాలు.
కాంతార1, మహావతార్ నరసింహ సినిమాలు ఆస్కార్ ఉత్తమ చిత్రం కేటగిరీలో జనరల్ ఎంట్రీ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ రిలీజ్ చేసిన లిస్ట్ లో ఈ రెండు సినిమాల పేర్లు ఉన్నాయి. 98వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనకు అర్హత పొందిన 201 ఫీచర్ ఫిల్మ్స్ లిస్ట్ లో ఈ రెండు సినిమాలు చోటు దక్కించుకోవడం విశేషం.
దాంతో పాటూ ఉత్తమ నటీనటులు, బెస్త్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ లాంటి తదిత కేటగిరీల్లో కూడా ఈ రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. హోంబలే ఫిల్మ్స్ కు ఇది చాలా గర్వకారణం. ఈ ఇయర్ ఆస్కార్ జనరల్ లిస్ట్ లో ఐదు ఇండియన్ సినిమాలు చోటు దక్కించుకుంటే అందులో రెండు సినిమాలు ఈ నిర్మాణ సంస్థకు చెందినవే కావడం విశేషం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ హోంబలే ఫిల్మ్స్ ఎక్స్‌లో ఆస్కార్ కు రెండు అడుగుల దూరంలో ఉన్నామని తెలిపింది.
5 ఇండియన్ సినిమాల్లో రెండు హోంబలే నుంచే
98వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 15, 2026న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో జరగనుండగా, ఈ అవార్డు కోసం పోటీ పడనున్న ఫైనల్ లిస్ట్ ను జనవరి 22న అనౌన్స్ చేయనున్నట్టు అకాడమీ వెల్లడించింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజైన సినిమాలు ఇందులో పోటీ పడనున్నాయి. కాగా ఈ కేటగిరీలో ఎంపికైన ఇండియన్ సినిమాల్లో కాంతార1, మహావతార్ నరసింహ, తన్వి ది గ్రేట్, సిస్టర్ మిడ్ నైట్, టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలున్నాయి. మరి హోంబలే ఫిల్మ్స్ ఏదొక విభాగంలో ఆస్కార్ ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.