ప్రభాస్-హృతిక్‌లతో కేజీఎఫ్ నిర్మాత?
ఇలాంటి సమయంలో హోంబలే సంస్థ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో భారీ డీల్ కుదుర్చుకోవడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది.;
భారతదేశంలోని బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తోంది హోంబలే ఫిలింస్. యష్ తో కేజీఎఫ్, కేజీఎఫ్ 2, రిషబ్ శెట్టితో `కాంతార` లాంటి భారీ పాన్ ఇండియా హిట్ చిత్రాలు తీసిన హోంబలే ప్రభాస్ కథానాయకుడిగా సలార్ లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ ని నిర్మించింది. ప్రభాస్ తో మూడు సినిమాల డీల్ లో భాగంగా తదుపరి సలార్ 2 చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటికే సలార్ 2 బౌండ్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడని టాక్ ఉంది. ప్రభాస్ `స్పిరిట్` చిత్రీకరణ ముగించి, తదుపరి `కల్కి 2898 ఏడి` సీక్వెల్, `సలార్ 2` సినిమాలను ముందుకు నడిపిస్తాడని కథనాలొస్తున్నాయి.
ఇలాంటి సమయంలో హోంబలే సంస్థ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో భారీ డీల్ కుదుర్చుకోవడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. ప్రభాస్‌తో ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తున్న సమయంలోనే హృతిక్ తో బిగ్ డీల్ కుదుర్చుకోవడం వెనక ఏదైనా మతలబు ఉందా? అన్నది ఆరాలు తీస్తున్నారు. హృతిక్ తదుపరి దక్షిణాది సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి పని చేసేందుకు హోంబలే లైన్ క్లియర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషిస్తున్నారు. వరసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లను అందిస్తున్న ఈ అగ్ర నిర్మాణ సంస్థ తదుపరి హృతిక్ కథానాయకుడిగా సోలో సినిమానే తీస్తుందా? లేక ప్రభాస్ -హృతిక్ లను కలుపుతూ మరింత భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుడుతుందా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికి హృతిక్ తో డీల్ కుదిరిందని హోంబలే అధికారికంగా ప్రకటించింది.
సంవత్సరాల తరబడి నిర్మాణంలో ఉన్న హృతిక్ రోషన్‌ను మేం హోంబాలే ఫిల్మ్స్ కుటుంబంలోకి సగర్వంగా స్వాగతిస్తున్నాము. ధైర్యం, గొప్పతనం, కీర్తి కథను విప్పబోతోంది, ఇంటెన్సిటీ ఊహలను కలిసే చోట, బిగ్ బ్యాంగ్ ప్రారంభమవుతుంది`` అని హోంబాలే ఫిల్మ్స్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాసింది. ప్రస్తుతానికి, నిర్మాణ సంస్థ హృతిక్ పేరును మాత్రమే వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడెవరు? ఇతర కాస్టింగ్, సిబ్బంది గురించి వెల్లడించాల్సి ఉంది.