• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లైగర్ ఫెయిల్యూర్ నేర్పిన...

లైగర్ ఫెయిల్యూర్ నేర్పిన పాఠం..!

| కెరీర్ మొదట్లోనే అర్జున్ రెడ్డి తో అదరగొట్టేసిన విజయ్ అలాంటి క్యారెక్టరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-04-02 06:32 GMT

అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ తన ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ. తనకు ఎలాంటి స్క్రీన్ నేమ్ లు అవసరం లేదు విజయ్ దేవరకొండ అంటే నేను ఒక్కడినే అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చే ఈ హీరో తనలో మ్యాటర్ చాలా ఉంది దాచి పెట్టా సినిమా సినిమాకు అది బయటకు తీస్తా అనేలా కనిపిస్తున్నాడు. కెరీర్ మొదట్లోనే అర్జున్ రెడ్డి తో అదరగొట్టేసిన విజయ్ అలాంటి క్యారెక్టరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాబోతున్నాడు. సమ్మర్ లో ప్రేక్షకులను అలరించడానికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు విజయ్. ఫ్యామిలీని నడిపించేందుకు ముందు ఉన్నవాడే ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో తను పాత్ర అదే అంటూ సినిమా కథ చూచాయగా చెప్పాడు విజయ్. అంతేకాదు ఈ సినిమా కథ వినగానే తన తండ్రి గుర్తొచ్చాడని అందుకే సినిమా లో హీరో పేరు గోవర్ధన్ అని పెట్టమని డైరెక్టర్ బుజ్జిని అడిగానని ఆయన ఒప్పుకున్నారని అన్నారు.

కెరీర్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు ఊహించని షాక్ లు ఇవ్వడం వల్ల కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తనని ఫ్లాపులు ఏవి చేయలేవని అంటున్నాడు. పూరీతో చేసిన లైగర్ సినిమా ఫ్లాప్ తన మీద ఏమంత ఎఫెక్ట్ చూపించలేదని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. కాకపోతే లైగర్ సినిమా వల్ల ఒకటి నేర్చుకున్నానని. సినిమా రిలీజ్ కు ముందు దాని రిజల్ట్ గురించి మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యానని అన్నారు. ఆ సినిమా ఫెయిల్యూర్ తో తనకు తానుగా వేసుకున్న శిక్ష అని అన్నారు విజయ్ దేవరకొండ.

పూరీ డైరెక్షన్ లో లైగర్ అంటూ వచ్చిన విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని రిలీజ్ ముందు ఊగిపోయాడు. తీరా సినిమా డిజాస్టర్ కా బాప్ అయ్యింది. అందుకే ఆ సినిమా నుంచి ఇక మీదట రిలీజ్ కు ముందు సినిమా రిజల్ట్ గురించి మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యానని అన్నారు విజయ్. జీవితంలో ఏదురయ్యే సమస్యల నుంచి ఫెయిల్యూర్స్ నుంచి మనకు మనమే కొన్ని లెసన్స్ నేర్చుకుంటామని అందరు అంటున్నాట్టుగా విజయ్ కూడా లైగర్ ఫెయిల్యూర్ నేర్పిన పాఠంతో కొన్నిటిని మార్చుకున్నట్టు చెప్పుకొచ్చాడు.

Tags:    
  • Arjunreddy 
  • Liger 
  • Vijaydevarakonda 
  • Ananyapandey 
  • PuriJagannadh 
  • FamilyStar 
  • Parasuram 
  • Dilraju 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS