సినిమా చూసి టీవీ షో కోసం సీన్ కాపీ.. నిర్మాత కేసు..
ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాల నుంచి సీన్లను అనుకరించి, లేదా పాటలను అనుకరించి సోషల్ మీడియాల్లో చాలా రచ్చ చేస్తున్నారు.;
ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాల నుంచి సీన్లను అనుకరించి, లేదా పాటలను అనుకరించి సోషల్ మీడియాల్లో చాలా రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పని చేసినందుకు ఏకంగా 25 కోట్ల రూపాయల ఫైన్ విధించడం చర్చగా మారింది. పాపులర్ టీవీ షో `గ్రేట్ ఇండియన్ కపిల్ షో`పై హేరా ఫేరి 3 నిర్మాత ఫిరోజ్ నదియా వాలా కేస్ వేసారు.
తమ అనుమతి లేకుండా బుల్లితెర హాస్య సన్నివేశాల కోసం, హేరాఫేరి 3 సన్నివేశాలను ఉపయోగించుకున్నందున కోట్లాది రూపాయల పరిహారం చెల్లించాలని కూడా ఫిరోజ్ ఒత్తిడిని పెంచారు. ఏదైనా తమ అనుమతి లేకుండా చేయకూడదు అనేది ఆయన ఆవేదన.
పరేష్ రావల్ పోషించిన హేరా ఫేరీకి బాబురావు ఆత్మ అని ఫిరోజ్ నొక్కిచెప్పారు. కొన్ని సంవత్సరాల పాటు కృషి చేస్తే ఈ పాత్ర పుట్టిందని, తమ హక్కులను కాలరాయకూడదని ఆయన అన్నారు. రెండు రోజుల్లోపు రూ. 25 కోట్ల పరిహారం చెల్లించాలని, 24 గంటల్లోపు క్షమాపణ చెప్పాలని నిర్మాతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను విస్మరిస్తే సివిల్, క్రిమినల్ కేసులు వేస్తామని భయపెట్టారు.
నిజానికి రెగ్యులర్ గా ఏదైనా రిలీజైన సినిమా నుంచి బుల్లితెర యాంకర్లు అనుకరించడం రెగ్యులర్ గా తెలిసేదే. కానీ ఇప్పుడు బిగ్ బాస్ 16 విషయంలో ఫిరోజ్ తగ్గేదేలే అంటున్నారు. కానీ ఆయన ఈ కేసులో నెగ్గుతారా లేదా? అన్నది అటుంచితే పరిశ్రమ సహచరులపైనా ఇలా కేసుల పేరుతో విసిగించడం ప్రమాదకరం అని కూడా విశ్లేషిస్తున్నారు.