కొత్త కారు కొన్న నటి హేమ.. ధర ఎంతంటే?
ఇక అలాంటి ఈమె తాజాగా కొత్త బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ మేరకు సదరు వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు హేమ. అందం, అభినయంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచింది. ముఖ్యంగా బ్రహ్మానందం వంటి సీనియర్ స్టార్ కమెడియన్ సరసన నటించి మరింత పేరు దక్కించుకుంది హేమ. ఇకపోతే ఇన్ని రోజులు డ్రగ్స్ కేసు అంటూ వార్తల్లో నిలిచిన ఈమె.. ఆ తర్వాత తన నిజాయితీని నిరూపించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా తనపై కావాలని రూమర్స్ క్రియేట్ చేసిన వారికి తన నిజాయితీతో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందని చెప్పాలి.
ఖరీదైన కారు కొనుగోలు చేసిన హేమ..
ఇక అలాంటి ఈమె తాజాగా కొత్త బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ మేరకు సదరు వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన కుటుంబంతో కలిసి వెళ్లి ఈ కారు కొన్న ఈమె అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చింది.. మొత్తానికి అయితే హేమ బెంజ్ కారు కొనుగోలు చేయడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ధర ఎంతంటే?
ఇకపోతే హేమ కొనుగోలు చేసిన ఈ బెంజ్ కార్ ఖరీదు విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 470 డి కార్ ను కొనుగోలు చేసింది. ఇది డీజిల్ ఎస్ యు వి కాగా.. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.34 కోట్ల నుండి రూ.1.43 కోట్ల వరకు ఉంటుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో స్థానిక రాష్ట్ర పన్నులను బట్టి ఆన్ రోడ్డు ధర సాధారణంగా రూ.1.58 కోట్ల నుండి రూ.1.76 కోట్ల మధ్య ఉంటుంది. మొత్తానికి అయితే ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును హేమ కొనుగోలు చేయడంతో ఈమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
హేమ కెరియర్..
హేమ విషయానికి వస్తే.. 1989 నుంచే తెలుగు సినిమాలలో యాక్టివ్ గా ఉంది ఈ ముద్దుగుమ్మ. అత్త, అక్క, తల్లి, స్నేహితురాలు ఇలా పలు పాత్రలు పోషించి.. మంచి పేరు దక్కించుకుంది. ఇకపోతే కామెడీ పాత్రలతో కూడా మంచి పేరు దక్కించుకున్న ఈమె.. చివరిగా 2023లో ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో నటించలేదు. కానీ బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో ఈమె కూడా ఉందని చెప్పి ఆ మధ్య తెగ హడావిడి నడిచిన విషయం తెలిసిందే. పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. ఇకపోతే గతంలో బిగ్ బాస్ హౌస్ లో కూడా పాల్గొన్న ఈమె.. ఒకటి, రెండు వారాలకి బయటకు వచ్చేసింది . మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత బెంజ్ కారు పుణ్యమా అని మళ్ళీ వార్తల్లో నిలిచింది హేమ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.