హాలీవుడ్ స్టార్స్ కంటే PCకి క్రేజు ఎక్కువ
ప్రైమ్ వీడియో యాక్షన్-కామెడీ `హెడ్స్ ఆఫ్ స్టేట్`ని స్ట్రీమ్ చేయనుంది. ఇంతకుముందే ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.;
ప్రైమ్ వీడియో యాక్షన్-కామెడీ `హెడ్స్ ఆఫ్ స్టేట్`ని స్ట్రీమ్ చేయనుంది. ఇంతకుముందే ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ కామెడీ హైలైట్ గా కనిపించాయి. పెద్ద స్టార్లు ఉన్నా కానీ ప్రియాంక చోప్రా గ్లింప్స్ ముందు, ఇతర విషయాలేవీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పీసీ గ్లోబల్ స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకుంది. అందువల్ల ప్రతి దేశంలోను తనను అనుసరించేవారు ఉన్నారు.
రాబోవు సినిమాలో అభిమానులు ప్రియాంక చోప్రా జోనాస్ MI6 ఏజెంట్ నోయెల్ బిస్సెట్‌గా నటించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇడ్రిస్ ఎల్బా , జాన్ సెనా ఇతర కీలక పాత్రలను పోషించిన ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహించారు. 2 నిమిషాల 46 సెకన్ల ట్రైలర్ బ్రిటన్ ప్రధాన మంత్రి సామ్ క్లార్క్ (ఎల్బా), అమెరికా అధ్యక్షుడు విల్ డెర్రింగర్ (సెనా)ల కథేమిటన్నది తెరపై పరిచయం చేసింది. ఆ ఇద్దరూ అంతర్జాతీయ రాజకీయాలు, కుట్రలు కుతంత్రాల నడుమ ప్రపంచ స్థిరత్వానికి ముప్పు కలిగించే చర్యల్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తారు. ఒక విదేశీ శత్రువు వారిని టార్గెట్ చేస్తుంటాడు. అదే క్రమంలో ఇరు దేశాల ఆర్మీ రంగ ప్రవేశం చేసాక ఏం జరిగిందనేదే సినిమా. ఎంఐ6 ఏజెంట్ నోయెల్ బిస్సెట్ పాత్రలో ప్రియాంక చోప్రా ఎంతో స్ట్రైకింగ్ గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. ట్రైలర్ లో కామెడీ, యాక్షన్ ప్రతిదీ ఆకట్టుకున్నాయి.
అయితే ప్రియాంక చోప్రా నటించిన ఈ సినిమా గురించి భారతదేశంలో సరైన ప్రచారం లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ముగ్గురు పెద్ద స్టార్లు నటించారు కానీ ఆశించిన బజ్ లేదు. దీంతో `హెడ్స్ ఆఫ్ స్టేట్` ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి ప్రియాంక చోప్రా మాత్రమే బిగ్ హోప్. ఇతర స్టార్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. `ది సూసైడ్ స్క్వాడ్` తర్వాత ఎల్బా- సెనా మొదటి స్క్రీన్ ఎంట్రీ గురించి కొంత చర్చ ఉన్నా.. సినిమాకి బజ్ లేకపోవడం ఆశ్చర్యపరిచింది. `హెడ్స్ ఆఫ్ స్టేట్` జూలై 2 నుండి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుంది.