• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరీష్ శంకర్ నెక్స్ట్...

హరీష్ శంకర్ నెక్స్ట్ అడాప్షన్ ఏంటి ?

| ప్రస్తుతం ఆయన మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేశాడు.

By - Tupaki Desk
Update: 2024-07-29 09:53 GMT

తాను చేసేది రీమేక్ సినిమాలే కానీ దాన్ని నేను అడాప్షన్ కింద భావిస్తాను అంటున్నారు హరీష్ శంకర్. ఒరిజినల్ కథతో సినిమా తీయడం కన్నా రీమేక్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం హార్ట్ అని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. ఆయన సినిమా వస్తుంది అంటే A,B,C అనే క్లాసులతో సంబంధం లేకుండా అందరు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మాస్ కమర్షియల్ సినిమాలకు హరీష్ శంకర్ మార్క్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేశాడు.

బాలీవుడ్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ చూస్తే హరీష్ శంకర్ చెప్పినట్టుగానే మూల కథ తీసుకుని తన మార్క్ మాస్ ట్రీట్ మెంట్ తో సినిమా తీశారని అనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో తన నెక్స్ట్ సినిమా గురించి కూడా చెప్పారు హరీష్ శంకర్. నెక్స్ట్ సినిమా రామ్ తో ఉంటుందని అన్నారు. ఐతే రామ్ తో హరీష్ శంకర్ సినిమా అనగానే రామ్ ఫ్యాన్స్ అందరు ఖుషి అవుతున్నారు.

హరీష్ శంకర్ సినిమాతో రామ్ మరో సూపర్ హిట్ కొట్టేస్తాడని ఫిక్స్ అవుతున్నారు. ఐతే రామ్ కోసం హరీష్ శంకర్ ఈసారైనా ఒరిజినల్ కథ చేస్తాడా లేదా మరో రీమేక్ అంటారా అన్నది తెలియాల్సి ఉంది. హరీష్ శంకర్ స్టోరీ అడాప్షన్ చేసుకున్నా దాన్ని తెలుగు ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైనింగ్, మాస్ అంశాలు జోడించి తెరకెక్కిస్తాడు. సో అందుకే ఆయన అడాప్షన్ కథ వరకే కానీ సీన్ టు సీన్ మక్కీ కి మక్కీ దించేయడం జరగదు. ఐతే ఇంత టాలెంట్ ఉండి సొంత కథలతో ఎందుకు సినిమాలు చేయట్లేదు అన్న డౌటే తప్ప ఇక్కడ హరీష్ శంకర్ ప్రతిభని తప్పుబట్టడం అనేది ఎవరి ఉద్దేశం కాదు.

హరీష్ శంకర్ ఇలా రీమేక్ సినిమాలు చేసినా ఒరిజినల్ కథలతో వచ్చినా తన డైరెక్షన్ సినిమా అంటే నమ్మకంగా డబ్బు ఖర్చు పెట్టి చూసే ఆడియన్ ని సాటిస్ఫై అయ్యేలా చేయడమే కావాలి. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే హరీష్ శంకర్, రవితేజ కాంబో ఒక సూపర్ హిట్ కొట్టబోతున్నారని అనిపిస్తుంది. ఇదే జోష్ రామ్ సినిమాకు కొనసాగిస్తే ఎనర్జిటిక్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఖుషి అవుతారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • MrBachchan 
  • Raviteja 
  • Bhagyashriborse 
  • Harishshankar 
  • Ramcharan 
  • Story 
  • Remake 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS