వీరమల్లు వాయిదాల పర్వం టాలీవుడ్ లో ఓ చరిత్ర!
సినిమా వాయిదా పడటం అన్నది సర్వ సాధారణం. ప్రకటించిన తేదీకి రిలీజ్ చేయకపోవడం అన్నది అందరికీ సాధ్యం కాదు.;
సినిమా వాయిదా పడటం అన్నది సర్వ సాధారణం. ప్రకటించిన తేదీకి రిలీజ్ చేయకపోవడం అన్నది అందరికీ సాధ్యం కాదు. అందకు కారణాలు అనేకం. ఎంత ప్రణాళిక ప్రకారం వెళ్లినా? కొన్ని సందర్భాల్లో రిలీజ్ వాయిదా పడుతుంది. వెనుక బలమైన కారణం లేనిదే కావాలని వాయిదా వేయరు. సినిమా స్టేటస్ ను బట్టి మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది అధికారికంగా ప్రకటిస్తుంటారు.
ఇలా ప్రకటించినా అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యం కాకపోవచ్చు. కొన్ని టెక్నికల్ రీజన్స్ తోనూ అప్పటి కప్పుడు వాయిదా వేయడం జరుగుతుంటుంది. ఇలా వాయిదాలు పడిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు చూసి ఉంటారు. కానీ `హరిహరవీరమల్లు` సినిమాలా వాయిదా పడటం మాత్రం చూడడం ఇదే తొలిసారి అని ప్రేక్షకులు అంటు న్నారు. పక్కాగా అధికారికంగా రిలీజ్ తేదీలు ప్రకటించి వాయిదా వేయడం మాత్రం ఆ చిత్ర మేకర్స్ కే చెల్లిందంటున్నారు.
టాలీవుడ్ లో ఇన్నిసార్లు వాయిదా పడిన సినిమా మరేది ఉండదని...ఇదే తొలి సినిమాగా రికార్డు సృష్టిం చిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. అటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. రిలీజ్ తేది చెప్పి మరీ వాయిదా వేయడం ఏంటో అర్దం కాలేదంటూ విశ్లేషకులు వ్యంగ్యా స్త్రాలు విసురు తున్నారు. వీరమల్లు ఐదున్నరేళ్ల క్రితం మొదలైన ప్రాజెక్ట్. షూటింగ్ అనుకున్న టైమ్ లో పూర్తికా కపోవడానికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇది కాదనలేని వాస్తవం.
కానీ ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి చిత్రీకరణ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతూ వచ్చింది. ఆ నమ్మకంతోనే యూనిట్ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ తేదీలు ప్రకటించుకుంటూ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ పోర్షన్ పూర్తి చేసిన తర్వాత కూడా రిలీజ్ విషయంలో మేకర్స్ ఇదే తంతు లో కనిపిస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నిసార్లు రిలీజ్ పోస్టర్లు వేసారో లెక్కలేదు.
ఇక 2025లో ఇంకెన్ని రిలీజ్ పోస్టర్లు వచ్చాయో అంతులేనిది. ఈనెలలోనే సినిమా రిలీజ్ చేస్తామని ఎంతో కాన్పిడెంట్ గా డేట్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఈనెలలో కాదు జులైలో విడుదల చేస్తామని కొత్త తేదీ ప్రకటించారు. మరి జూలై 24 సమీపిస్తున్న సమయంలో ఈ తేదీ కాదు..మరో తేదీ అంటూ ముందుకొస్తారా? అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.