వర్షాలుంటే అలా..లేకపోతే ఇలా!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరిహరవీరమల్లు' రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. జులై 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం పనులు కూడా మొదలయ్యాయి.;
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరిహరవీరమల్లు' రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. జులై 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం పనులు కూడా మొదలయ్యాయి. వీరమల్లును వీలైనంతగా జనాలకు ఎక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు తొలిసారి రిలీజ్ తేదీ ప్రకటించిన నేపథ్యంలో తిరుపతిలో నిర్వహించాలని సన్నాహాలు చేసారు.
అధికారికంగా ప్రకటన కూడా చేసారు. కానీ వాయిదా పడటంతో మళ్లీ ఆ చర్చ జరగలేదు. తాజాగా మళ్లీ రిలీజ్ తేదీ ప్రకటించిన నేపథ్యంలో ప్రీరిలీజ్ వెన్యూ ఎక్కడ? అన్న చర్చమొదలైంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత రెండుప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విజయవాడ లేదా? తిరుపతిలో నిర్వ హించాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఏ. ఎం. రత్నం తెలిపారు. విజయవాడ వేదిక అవ్వాలంటే ఆరోజు వర్షాలు పడాలి.
అప్పుడే ఇన్ డోర్ వేదికగా విజయవాడ అవుతుందన్నారు. వర్షాలు లేకపోతే మాత్రం తిరుపతిలోనే ప్రీ రిలీజ్ నిర్వహిస్తామన్నారు. దీంతో ప్రీ రిలీజ్ వెన్యూ ఎక్కడ అన్నది నాలుగు రోజుల ముందు అధికారికంగా వెల్లడిస్తామన్నారు. అంటే నాలుగు రోజుల ముందు ఏపీలో వాతావరణాన్ని బట్టి వేదికగా ఎక్కడ అన్నది డిసైడ్ చేస్తారు. ఈవెంట్ కు మాత్రం పవన్ కళ్యాణ్ తప్పక హాజరవుతారు. ఇంత వరకూ పవన్ కళ్యాణ్ ఏ ప్రచార కార్యక్రమానికి హాజరు కాని సంగతి తెలిసిందే.
ప్రచారానికి సంబంధించిన వ్యవహరమంతా నిర్మాతలు...హీరోయిన్లు భుజాన వేసుకుని మోస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం పీకే తప్పక హాజరవుతారు. పవన్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందే పవన్ రాజకీయాల కారణంగా పాన్ ఇండియాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.