వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ వైజాగ్ లోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` భారీ అంచ‌నాల మ‌ధ్య ఈనెల 24న పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-13 07:00 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` భారీ అంచ‌నాల మ‌ధ్య ఈనెల 24న పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినిమా రిలీజ్ కు నాలుగు రోజుల ముందు ఈవెంట్ జ‌ర‌గ‌బోతుంది. అయితే ఈవెంట్ ఎక్క‌డ జ‌రుగుతుంది? అన్న దానిపై ఇప్ప‌టికే స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్య‌లో నిర్మాత ఏ.ఎం ర‌త్నం తిరుప‌తి లేదా? విజ‌య‌వాడ‌లో జ‌రుగుతుంద‌న్నారు.

అందుకు వాతావ‌ర‌ణ కీల‌కం అన్నారు. వ‌ర్షాలు ప‌డితే ఇండోర్ లో ..లేక‌పోతే భారీ ఎత్తున‌ అభిమానుల స‌మ‌క్షంలో తిరుప‌తిలో జ‌రుగుతుంద‌న్నారు. తొలిసారి సినిమా రిలీజ్ తేదీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో శ్రీవారి చెంత‌లోనే వేడుక నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు. కానీ డిలే అవ్వ‌డంతో మ‌ళ్లీ టాపిక్ రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా విశాఖ‌ప‌ట్ట‌ణం మ‌రో వేదిక‌గా తెర‌పైకి వ‌చ్చింది. ప్రీరిలీజ్ వెన్యూ వైజాగ్ అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లైంది. దీంతో వేదిక‌పై మ‌రింత సంక్లిష్ట‌త ఏర్ప‌డింది.

దీనికి సంబంధించి మేక‌ర్స్ నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌స్తే న‌మ్మ‌లేని ప‌రిస్థితి. మ‌రి ఉన్న‌ట్లుండి వైజాగ్ వేదిక‌ ఏ కార‌ణంగా తెర‌పైకి వ‌చ్చిన‌ట్లు అంటే? ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు వినిపిస్తుంది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించాల‌ని ప‌వ‌న్ ఆదే శించిన‌ట్లు అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైన స‌మాచారం. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ వంటి ప్రాంతాల్లోనే ఎక్కువ‌గా ఉంటున్నారు.

ఉత్త‌రాంధ్ర అభిమానుల్ని క‌లిసింది లేదు. ఈ నేప‌థ్యంలోనే విశాఖ వేదికైతే శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లా అభిమానుల‌కు క‌నెక్ట్ అయిన‌ట్ల ఉంటుంద‌ని ఇలా ప్లాన్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈవెంట్ కు హాజ‌రైతే అక్క‌డ స‌న్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ ఎత్తున అభిమానులు హాజ‌ర‌వుతారు. అందుకు భారీ వేదిక‌గా ఓ పెద్ద గ్రౌండ్ అవ‌స‌ర మ‌వుతుంది. ప‌వ‌న్ సినిమాల‌కు సంబంధించి విశాఖ వేదికైంది కూడా చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే.

Tags:    

Similar News