మే వచ్చినా వీరమల్లు సౌండ్ చేయట్లేదుగా
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మరోసారి లేటవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. వీరమల్లు మే 9న రిలీజ్ కానుందని మేకర్స్ చెప్పారు;
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మరోసారి లేటవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. వీరమల్లు మే 9న రిలీజ్ కానుందని మేకర్స్ చెప్పారు. కానీ ఇప్పటికీ చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంతో సినిమా వాయిదా కన్ఫర్మ్ అని అందరూ ఫిక్సయ్యారు. మే 9న వీరమల్లు రాకపోవడంతో ఆ డేట్ లో శ్రీవిష్ణు సింగిల్, సమంత ప్రొడక్షన్ లో రూపొందిన శుభం సినిమాలు ఆ డేట్ ను వాడుకుంటున్నాయి.
అయితే వీరమల్లు సినిమా వాయిదా పడినప్పటికీ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా పోస్ట్‌పోన్ కు మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ అనే విషయం తెలిసిందే. రాజకీయాలతో పవన్ బిజీగా ఉండటం వల్ల వీరమల్లుకు సంబంధించిన మరో నాలుగైదు రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ కారణంతోనే రిలీజ్ డేట్ ఎప్పుడనేది మేకర్స్ ఫిక్స్ చేయలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే కొంతమంది ఫ్యాన్స్ జూన్ లో సినిమా రిలీజవుతుందని భావిస్తున్నప్పటికీ అది కూడా అనుమానమే అంటున్నారు. ఒకవేళ హరిహర వీరమల్లు జూన్ ను సెలెక్ట్ చేసుకుంటే, కుబేర, కన్నప్ప లాంటి సినిమాలున్నాయి. ఏదేమైనా వీరమల్లు జూన్ మొదటి రెండు వారాల్లో వస్తే చాలా వరకు సేఫ్ అవుతుంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
అసలే వీరమల్లుపై హైప్ అంతంతమాత్రంగానే ఉంటే రిలీజ్ డేట్ పలుమార్లు మారుతూ వస్తుండటం వల్ల ఉన్న ఆ హైప్ కాస్తా పోతుంది. దానికి తగ్గట్టే మేకర్స్ కూడా సినిమా నుంచి ఎలాంటి పోస్టర్లు, టీజర్లు కూడా రిలీజ్ చేయలేదు. వీరమల్లు గురించి మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లలో కూడా ఆందోళన మొదలైంది.
ఎవరెంత ఇబ్బంది పడినా, ఆందోళన పడినా ఈ విషయంలో మేకర్స్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ముందు ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మొదలైన ఈ సినిమా ఇలా పలుమార్లు వాయిదా పడటం వల్లే అసలు బజ్ లేకుండా రిలీజ్ చేయాల్సి వస్తుందేమోనని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో మేకర్స్ ఏదొక క్లారిటీ ఇస్తే బావుంటుందని అందరూ ఫీలవుతున్నారు.