గొప్ప మనసు చాటుకుంటున్న దువ్వాడ మాధురి.. బిగ్ బాస్ డబ్బు మొత్తం వారికే..
సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;
సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిక్కచ్చితత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ జంట.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలా పాపులారిటీ అందుకున్న ఈ జంటకి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లో మొదట్లోనే పాల్గొనే అవకాశం లభించింది. కానీ కొన్ని కారణాల రీత్యా వీరిద్దరూ జంటగా హౌస్ లోకి అడుగుపెట్టలేదు. కానీ దివ్వెల మాధురి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కోరిక మేరకే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పుకొచ్చింది.
ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ తో మొదలయింది. ఇక మధ్యలో కామనర్ దివ్య నిఖిత వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఆ తర్వాత మరో ఆరు మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో దివ్వెల మాధురి కూడా ఒకరు. హౌస్ లో అడుగుపెట్టినప్పుడు ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత తనూజాకీ తల్లిగా మారింది. నాగార్జున సలహా మేరకు తన గేమ్ ను మార్చుకుంది. కానీ అనుకోకుండా హౌస్ నుండి బయటకు వచ్చింది. ఇక బిగ్ బాస్ బజ్లో పాల్గొన్న దివ్వెల మాధురి తన ఇష్ట ప్రకారమే హౌస్ లోకి వెళ్ళానని, ఇష్టప్రకారమే బయటకు వచ్చేసాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ ను ఉపయోగించుకోనని గతంలోనే చెప్పిన ఈమె.. ఆ మాటను నిలబెట్టుకుంటుంది. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి తన బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ను పేదలకు పంచిపెడుతోంది. ఈ విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేశారు. విషయంలోకి వెళ్తే.. గత మూడు రోజుల క్రితం.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట అనుచరుడిగా ఉన్న లక్ష్మీనారాయణ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో హాస్పిటల్ పాలయ్యారు. అతడిని.. ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించిన ఈ జంట.. 80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అందులో రూ.30,000 హాస్పిటల్ వైద్య ఖర్చుల కోసం కాగా, మిగతా రూ.50,000 కుటుంబ పోషణ నిమిత్తం అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు మరో క్యాన్సర్ బాధితురాలికి సహాయం అందించింది ఈ జంట. విషయంలోకి వెళ్తే..నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామంలో H. కుమారి అనే ఒక మహిళ పేగు క్యాన్సర్ తో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో ఉన్నారని తెలుసుకొని.. ఆపరేషన్ ఖర్చుల కోసం రూ.1,10,000 సహాయం చేశారు. ప్రస్తుతం తన బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఇలా పేదలకు పంచుతూ గొప్ప మనసు చాటుకుంటోంది ఈ జంట.