వీరమల్లు.. ఇలాగైతే ఎప్పటికి?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో హరి హర వీరమల్లు సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో హరి హర వీరమల్లు సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. యాక్షన్, అడ్వెంచర్ జోనర్ లో క్రిష్, జ్యోతికృష్ణ వహించిన ఆ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఎప్పుడో ప్రారంభమైన వీరమల్లు షూటింగ్.. కొన్ని రీజన్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. క్రిష్ కొంత భాగం తెరకెక్కించగా, ఆ తర్వాత దర్శకత్వం బాధ్యతలను జ్యోతికృష్ణ తీసుకున్నారు. ఇన్నేళ్లు సెట్స్ పై ఉన్న మూవీకి రీసెంట్ గా పవన్ డేట్స్ కేటాయించడంతో షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే.. రెండు రోజుల క్రితం సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వీఎఫ్ ఎఫ్ వర్క్స్ పెండింగ్ ఉండడంతో మరోసారి రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో హరి హర వీరమల్లు కొత్త విడుదల తేదీపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జులై 4 అని, జులై 25 అని జోరుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ రెస్పాండ్ అయ్యి.. తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అప్పటి వరకు మీ సపోర్ట్, లవ్ ఉండాలని కోరుకుంటున్నట్లు నాలుగు రోజుల క్రితం చెప్పారు. దీంతో అనౌన్స్మెంట్ వచ్చేస్తుందని ఆశపడ్డారు.
కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏం జరుగుతుందో తెలియదు కానీ మేకర్స్ ఇంకా విడుదల ఎప్పుడు అనేది ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు సినీ ప్రియులు, పవన్ ఫ్యాన్స్.. రిలీజ్ డేట్ కోసం పోస్టులు పెడుతున్నారు. రత్నం గారు.. కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేయండని కోరుతున్నారు. ఏం జరుగుతుందని క్వశ్చన్ చేస్తున్నారు.
అయితే వీరమల్లు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఆగస్టులో సినిమాను స్ట్రీమింగ్ చేద్దామని నిర్ణయించుకుందట. కానీ మేకర్స్ సినిమాను వాయిదా వేశారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులతో నిర్మాత డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఎప్పుడు వీరమల్లు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.