వీరమల్లు ఫస్ట్ పార్ట్ లో ఆ హీరోయిన్ కనిపించదట
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ ఫిల్మ్ హరిహర వీరమల్లు జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ ఫిల్మ్ హరిహర వీరమల్లు జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కరోనాకు ముందే మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేటవడంతో వీరమల్లు డైరెక్టర్ గా క్రిష్ తప్పుకున్నాడు.
దీంతో ఏఎం జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుని ఆ సినిమాను పూర్తి చేశాడు. సినిమా షూటింగ్ లోనే ఎక్కువ సమయం ఉండటంతో వీరమల్లుపై ఊహించినంత బజ్ లేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలోకి వస్తుందంటే ఉండే హంగామా వేరు. కానీ ఇప్పుడు హరి హర వీరమల్లుకు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.
అయితే హరి హర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మొఘల్ సామ్రాజ్యపు యువరాణి రోషనారా బేగం పాత్రలో కనిపించనుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నర్గీస్ ఫక్రీ సినిమాలో ఉందని వార్తలైతే వచ్చాయి కానీ ఇప్పటివరకు వీరమల్లు నుంచి రిలీజైన కంటెంట్ లో ఆమె ఎక్కడా కనిపించింది లేదు. దీంతో అసలు వీరమల్లులో నర్గీస్ ఉందా లేదా అనే అనుమానాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి.
ఈ అనుమానాలకు రీసెంట్ గా హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నర్గీస్ ఫర్గీ వీరమల్లు ఫస్ట్ పార్ట్ లో కనిపించదని చెప్పారు. వీరమల్లు సెకండ్ పార్ట్ లో నర్గీస్ ఫక్రీ కీలక పాత్ర పోషించనుందని, మొదటి భాగంలో ఆమె అసలు కనిపించదని ఆయన తెలిపారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.