పవన్ కాదు.. శ్రీ విష్ణు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత ఆలస్యం అయిన సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమా అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది.;

Update: 2025-04-17 09:41 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత ఆలస్యం అయిన సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమా అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది. దీని తర్వాత ప్రకటించిన ‘భీమ్లా నాయక్’ రిలీజై మూడేళ్లు దాటింది. కానీ ఇంకా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప.. చెప్పిన డేట్‌ను అందుకోలేకపోతున్నారు. మార్చి 30 నుంచి వాయిదా వేశాక టీం ప్రకటించిన కొత్త డేట్.. మే 9. ఆ డేట్‌కు ఇంకో మూడు వారాలే సమయం ఉంది.

కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. పవన్ మళ్లీ అనారోగ్యం పాలవడం, వేరే కారణాల వల్ల షూటింగ్‌కు హాజరు కావట్లేదు. దీంతో ‘వీరమల్లు’ మరోసారి వాయిదా పడడం అనివార్యంగా మారింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. మే 9న సినిమా వస్తుందనే ఆశలు ఎవ్వరికీ లేవు. ఈ నేపథ్యంలో ఆ డేట్‌ మీద వేరే చిత్రాలు కర్చీఫ్‌లు వేయడం మొదలైంది.

ముందుగా శ్రీ విష్ణు సినిమా ‘సింగిల్’ కోసం మే 9 డేట్‌ను ఎంచుకున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, కల్య ఫిలిమ్స్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఐకానిక్ డేట్‌లో రిలీజ్ చేయబోతున్నారు. గత ఏడాది ‘స్వాగ్’ మూవీతో పలకరించిన శ్రీ విష్ణు నుంచి రాబోతున్న కొత్త చిత్రమిది. ఇందులో ఒక క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నాడు విష్ణు. ఈ మధ్యే వచ్చిన ‘సింగిల్’ టీజర్ ఆకట్టుకుంది. ఇందులో విష్ణు సరసన కేతిక శర్మతో పాటు ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. మే 9 క్రేజీ డేట్ కావడంతో ఇంకా ఒకట్రెండు సినిమాలు అదే రోజున విడుదలయ్యే అవకాశాలున్నాయి. పవన్ బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్ పూర్తి చేయడాన్ని బట్టి ‘హరిహర వీరమల్లు’ జులై లేదా ఆగస్టులో రిలీజయ్యే ఛాన్సుంది.

Tags:    

Similar News