స్టీవ్ జాబ్స్, జుకర్‌బర్గ్ నుండి విరాట్-అనుష్క వరకు!

ఆధ్యాత్మిక గురువు నిమ్ కరోలి బాబా జీవితాధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం `హనుమాన్ అంశ` ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Update: 2026-09-12 06:15 GMT

ఆధ్యాత్మిక గురువు నిమ్ కరోలి బాబా జీవితాధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం `హనుమాన్ అంశ` ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విశాల్ చతుర్వేది రాత, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే సంచలన విజయంగా మారింది. ఈ సినిమా విజ యంతో దీనికి సీక్వెల్స్ రాబోతున్నాయని ప్ర‌క‌టించారు. అలాగే నిమ్ కరోలి బాబా భక్తులైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, జూలియా రాబర్ట్స్ వంటి ప్రముఖులు సీక్వెల్‌లో కనిపిస్తారా? అనే చర్చ కూడా నెట్టింట‌ మొదలైంది.

ఈ అంశంపై చిత్ర నిర్మాత నమ్రతా సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `హనుమాన్ అంశ` చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేసామ‌న్నారు. విశాల్ రాసిన `డివైన్ డిటూర్: దట్ ఛేంజ్డ్ మై లైఫ్` అనే పుస్తకం ఆధారంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. సీక్వెల్స్ కోసం అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ వంటి ప్రముఖ భక్తులను సంప్రదించామని.. వారికి ఈ సినిమా గురించి అవగాహన ఉందని పేర్కొన్నారు.

మొదటి భాగంలో నిమ్ కరోలి బాబా తొలి జీవితం నుంచి కైంచీ ధామ్ వరకు చూపించామని తెలిపారు. రెండవ భాగం కైంచీ ధామ్‌లోని ఆధ్యాత్మిక సంఘటనలు , భారతీయ భక్తుల అనుభవాల చుట్టూ సాగుతుందని స్పష్టం చేశారు. బాబా జీవితంలో వేలాది మంది భారతీయ భక్తుల జీవితాలు ముడిపడి ఉన్నాయని ఈనేప‌థ్యంలో రెండో భాగంలో వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఇక మూడవ భాగంలో నిమ్ కరోలి బాబా అంతర్జాతీయ స్థాయిలో చూపిన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఆవిష్కరిం చబోతున్నట్లు నమ్రతా సింగ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే, నటి జూలియా రాబర్ట్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను ఆధ్యాత్మిక శక్త్యావేశంతో బాబా ఎలా ప్రభావితం చేశారో? భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచ పటంలో ఎలా? నిలబెట్టారో మూడో భాగంలో వివరంగా చూపిస్తామన్నారు. ఈ క్రమంలోనే సీక్వెల్‌లో సెలబ్రిటీల అతిథి పాత్రలు ఉండే అవకాశం ఉందని సూచించారు.

స్వాతంత్య్రానికి పూర్వం ఉత్తర భారతదేశంలో లక్ష్మీ నారాయణ్ ఆధ్యాత్మిక అన్వేషణ, ఆయన నిమ్ కరోలి బాబాగా మారిన తీరును `హనుమాన్ అంశ` చిత్రంలో అద్భుతంగా చూపించారు. శోభినాథ్ సత్య ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం చాలా త‌క్కువ బ‌డ్జెట్ తోనే తెర‌కెక్కింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రారంభంలో సాధారణ వసూళ్లు సాధించినా? రివ్యూలు పాజిటివ్ గా రావ‌డం ...అన్నింటిని మించి మౌత్ టాక్ పాజిటివ్ గా రావ‌డంతో ఒక్క‌సారిగా

ఊపందుకుని 173.63 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

ఈ సినిమా విజయానికి రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు ద‌క్కాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రత్యేక ప్రదర్శనను వీక్షించి ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఆధ్యాత్మిక చిత్రమని కొనియాడారు. ఇటీవల యూనిట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలిసి ఆశీస్సులు తీసుకుంది.

Tags:    

Similar News