అంత పెద్ద హీరోని ఆధ్యాత్మిక‌ సీక్వెల్‌లోకి లాగారు.. ఖంగు తిన్న నిర్మాత‌!

అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి వివ‌రాలు అధికారికంగా వెల్లడించ‌కుండానే.. పెద్ద సూప‌ర్ స్టార్ సీక్వెల్ లో న‌టిస్తున్నాడంటూ ఒక‌టే ప్ర‌చారం హోరెత్తిపోతోంది. దీంతో ఖంగుతిన్న మేక‌ర్స్ దానిపై వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

Update: 2026-09-30 11:39 GMT

ఒక అనూహ్య‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ ఏ ద‌ర్శ‌క‌నిర్మాత‌లో అయినా హుషారు నింపుతుంది. అలాంటి హుషారులోనే ఉన్నారు హ‌నుమాన్ అంశ్ మేక‌ర్స్... ఇదే ఉత్సాహంలో సీక్వెల్ తెరకెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి వివ‌రాలు అధికారికంగా వెల్లడించ‌కుండానే.. పెద్ద సూప‌ర్ స్టార్ సీక్వెల్ లో న‌టిస్తున్నాడంటూ ఒక‌టే ప్ర‌చారం హోరెత్తిపోతోంది. దీంతో ఖంగుతిన్న మేక‌ర్స్ దానిపై వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

ఆధ్యాత్మిక డ్రామా, నిజ క‌థ ఆధారంగా తెరకెక్కిన `హనుమాన్ అంశ్` సినిమా బాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద మూడో వారంలోనూ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. కొత్తగా విడుదలవుతున్న సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురువుతున్నా ఈ చిత్రం తన జోరును కొనసాగిస్తోంది. అయితే సినిమా లాభాల్లోంచి కొంత భాగాన్ని సామాజిక కార్య‌క్ర‌మాల‌కు వెచ్చించ‌డం తో వీళ్ల‌పై బోలెడంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది.

ఈ చిత్రంలో `మైనే తేరే హి భరోసే` అనే పాటను పాడి ఎంతో పేరు సంపాదించిన గాయకుడు సునీల్ లోధీకి సంబంధించి చిత్ర బృందం మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. తీవ్రమైన దృష్టి లోపంతో బాధపడుతున్న సునీల్ లోధీ కంటి చికిత్స కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సాయం చేస్తోందని స‌హ‌నిర్మాత‌ అనుప్రియ వెల్లడించారు. ఇదంతా అందరూ కలిసి చేస్తున్న సంయుక్త ప్రయత్నం అని ఆమె కొనియాడారు.

ఇదిలా ఉంటే విశాల్ చతుర్వేది దర్శకత్వం వ‌హించ‌నున్న సీక్వెల్ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలపై అనుప్రియ స్పష్టతనిచ్చారు. తన అభిమాన నటుడు అక్షయ్ కుమార్ గురించి గతంలో తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ తప్పుగా అర్థం చేసుకున్నార‌ని అనుప్రియ‌ స్పష్టం చేశారు. `హనుమాన్ అంశ్` పార్ట్ 2 చిత్రంలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు తాను ఎలాంటి ప్రకటన చేయలేదని.. ప్రచారంలో ఉన్న ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని క్లారిటీ ఇచ్చారు.

సినిమా సక్సెస్‌తో పాటు తమ చిత్ర యూనిట్ సభ్యులకు అండగా నిలవడంపై నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా విశేషాలు.. దానిపై వస్తున్న పుకార్లపై కో-ప్రొడ్యూసర్ అనుప్రియ నగర్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడి అన్ని విషయాలపైనా పూర్తి స్పష్టతను అందించారు. అయితే అంత పెద్ద హీరోని సీక్వెల్ కోసం లాక్ చేసార‌నే ప్ర‌చారంతో నిర్మాత‌లు ఖంగు తిన్నారు. హ‌నుమాన్ అంశ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కిస్తుంటే అది క‌చ్ఛితంగా క్రేజీ మ్యాట‌ర్. ఒక ఆధ్యాత్మిక కాన్సెప్ట్ ఉన్న సినిమా 300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించడం నిజంగా ఒక సంచ‌ల‌నం. అందుకే ఇప్పుడు సీక్వెల్ పైనా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Tags:    

Similar News