స‌హారా స్కామ్ ని కెలుకుతోన్న స్కామ్ డైరెక్ట‌ర్!

సహారా సంస్థల అధినేత సుబ్రతా రాయ్ పై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే 2014లో ఆయనను అరెస్ట్ చేశారు.

Update: 2024-05-16 11:30 GMT

స్కామ్ వెబ్ సిరీస్ లో థ‌ర్డ్ ఎడిష‌న్ రెడీ అవుతోంది. 'స్కామ్ 1992'.. 'స్కామ్ 2003'త‌ర‌హాలోనే 'స్కామ్ 2010' 'ది సుబ్రతా రాయ్ సాగా' అనే టైటిల్ తో డైరెక్టర్ హన్సల్ మెహతా ఈ సిరీస్ ని ప్ర‌క‌టించారు. సహారా సంస్థల అధినేతగా పేరుగాంచిన వ్యాపారవేత్త దివంగత సుబ్రతా రాయ్ స్టోరీని ఈ సిరీస్ ద్వారా చెప్ప‌బోతున్నారు. హన్సల్ మెహతా ఇప్పటికే సోనీలివ్ లో స్కామ్ 1992, స్కామ్ 2003 పేరుతో రెండు వెబ్ సిరీస్ లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మొదటిది 1992లో బయటపడిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ కాగా, రెండవ‌ది 2003లో సంచలనం రేపిన అబ్దుల్ కరీం తెల్గీ స్టాంప్ పేపర్ స్కామ్. ఈ రెండింటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స‌హారా స్కామ్ ని త‌ట్టి లేపుతున్నాడు. తమల్ బందోపాధ్యాయ రాసిన 'సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ' పుస్తకం ఆధారంగా ఈవెబ్ సిరీస్ రూపొందుతుంది. సోనీలివ్ -అప్లౌజ్ ఎంటర్‌టైన్మెంట్- స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read more!

సహారా సంస్థల అధినేత సుబ్రతా రాయ్ పై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే రూ.25 వేల కోట్ల మొత్తం ప్రభుత్వ అధికార వర్గాల దగ్గర ఉంది. దీనిపై హన్సల్ స్పందిస్తూ 'స్కామ్ నాకు కేవలం ఓ ఫ్రాంఛైజీ మాత్రమే కాదు. మన కాలంలో జరిగిన వృత్తాంతాన్ని చెప్పడం. అలాంటిదే మరో గొప్ప స్టోరీ కోసం మరోసారి అప్లౌజ్, సోనీలివ్ లతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది' అన్నారు.

దీంతో మ‌రో పెద్ద కుంభకోణం వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇండియా కుంభ‌కోణాల‌తో అట్టుడికిపోతుంది. ర‌క‌ర‌కాల కుంభ‌కోణాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. దేశం విడిచి పారిపోతున్న మోస‌గాళ్ల సంఖ్యం పెరిగిపోతుంది. భార‌తీయ బ్యాంకుల‌ను మోసం చేసి విదేశాల్లో ఎంచ‌క్కా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి క‌థ‌ల్ని కెలికేతే కొన్ని వంద‌ల‌..వేల వెబ్ సిరీస్ లు వ‌స్తాయి.

Tags:    

Similar News