12 ఏళ్ల బంధానికి స్వస్తి.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

మరి ఇంతకీ ఆ జంట ఎవరో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది.. వాళ్లే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నటుడు అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్.. అలాగే ఆయన భార్య సైంధవి..;

Update: 2025-10-01 06:32 GMT

వీరు ఇండస్ట్రీలో స్టార్ కపుల్..ముఖ్యంగా కోలీవుడ్లో ఫేమస్ సెలబ్రిటీ జంట.. కానీ అలాంటిది సడన్ గా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తమ 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. మరి ఇంతకీ ఆ జంట ఎవరో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది.. వాళ్లే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నటుడు అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్.. అలాగే ఆయన భార్య సైంధవి.. ఈ జంటకు తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయం అభిమానులను పూర్తిస్థాయిలో దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.

సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు ప్రేమించుకునే పెళ్లి చేసుకుంటారు. కానీ చాలామంది ఆ ప్రేమను చివరి వరకు కంటిన్యూ చేయలేరు. కొంతమంది ఎంతో గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ చిన్నచిన్న మనస్పర్ధలకే వారి బంధాన్ని తెంచేసుకుంటారు. ఇదిలా ఉంటే స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడ్డ సైంధవి, జీవి ప్రకాష్ కుమార్ లు పెద్దలను ఒప్పించి , 2013లో పెళ్లి చేసుకున్నారు.. అలా 2020లో వీరికి అన్వి అనే ఓ పాప పుట్టింది.ఇక దశాబ్దానికి పైగా కలిసి ఉన్న ఈ జంట సడన్ గా విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.

ఇదేంటి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట 12 సంవత్సరాలు కలిసి ఉండి, విడాకులు తీసుకోవడం ఏంటి అని షాక్ అయిపోయారు. కానీ విడాకులు నిజమే అని తేల్చేయడంతో అభిమానులు కాస్త బాధపడ్డారు.ఇక ఈ జంట మే 13,2024లో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా వీరికి చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టులో కూతురు గురించి అడగగా.. కూతుర్ని తానే పెంచుకుంటానని సైంధవి చెప్పింది. ఈ జంట విడాకులు తీసుకున్నప్పటికి కూతురికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో పేరెంట్స్ గా తమ బాధ్యతలు కొనసాగిస్తామని తెలియజేశారు.. ఈ జంట 2024 లో విడిపోతున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత 2025లో ఇద్దరు కలిసి ఓ మ్యూజిక్ కచేరిలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే విడిపోవాలని ఆలోచించుకున్నప్పటికీ వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు ఈ ఒక్క సంఘటనతో బయటపెట్టారు.

అయితే జీవి ప్రకాష్ కుమార్ సైంధవి ల విడాకులకు కారణం ఓ ప్రముఖ హీరోయిన్ అన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలు రూమర్లు అని, ఆ హీరోయిన్ తో పాటు జీవి ప్రకాష్ కూడా కొట్టి పారేశారు. జీవి ప్రకాష్ ఓవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పలు తమిళ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తూనే రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేస్తున్నారు.

Tags:    

Similar News