• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం కొత్త...

గుంటూరు కారం కొత్త పోస్టర్స్​ కన్ఫ్యూజన్​.. ఒక్క రాత్రిలోనే

| సూపర్ స్టార్ మహేశ్​ బాబు నేడు(ఆగస్ట్​ 9) పుట్టినరోజు సందర్భంగా సోషల్​మీడియాలో అంతా ఆయనదే హవా కనిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-08-09 15:35 GMT

సూపర్ స్టార్ మహేశ్​ బాబు నేడు(ఆగస్ట్​ 9) పుట్టినరోజు సందర్భంగా సోషల్​మీడియాలో అంతా ఆయనదే హవా కనిపిస్తోంది. అభిమానులంతా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్లు, హ్యాష్​ ట్యాగ్​ను ట్రెండ్ చేస్తూ విషెస్ తెలుపుతూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' మూవీటీమ్​ కూడా అర్ధరాత్రి ఓ పోస్టర్​ను ఉదయం అయ్యాక ఓ పోస్టర్​ను విడుదల చేసింది. దీంతో ఇప్పుటికే కన్ఫూజన్​లో ఉన్న అభిమానులను, సినీ ప్రియులను మరింత కన్ఫ్యూజన్​లో పడేసింది.

మొదటి పోస్టర్​లో మహేశ్​.. లుంగీ కట్టి, కళ్ళజోడు పెట్టి, బీడీ కాలుస్తున్న మాసీ స్టిల్​ను విడుదల చేసింది. దీంతో చాలా రోజులుగా ప్రశ్నగా మిగిలి ఉన్న రెండు సమాధానాలు క్లారిటీ చేసింది. సంగీత దర్శకుడుగా ఉన్న తమన్​, సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్​ను తప్పించారని వారి స్థానాల్లో కొత్త సినిమా టోగ్రాఫర్​గా రవి కె. చంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్​గా ఇతర వ్యక్తుల పేర్లు వినిపించాయి. కానీ ఈ మొదటి పోస్టర్​లో తమన్​, పీఎస్ వినోద్ పేర్లే ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లలేదని ఇంకా గుంటూరు కారం సినిమా కోసమే పనిచేస్తున్నారని ఓ క్లారిటీ వచ్చింది.


కానీ ఈ క్లారిటీ ఎక్కువ సేపు ఉండలేదు. అమ్మయ్య ఎన్నో రోజులుగా మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం వచ్చిందనే లోపే.. కొత్త పోస్టర్​తో మళ్లీ కన్ఫ్యూజన్​లో పడేసింది మూవీటీమ్​. రెండో పోస్టర్​లో తలకు ఎర్ర బ్యాండ్​ ఎర్ర షర్ట్​ లోపల బ్లాక్ కలర్ నెక్​ బనీయన్​లో మాస్​ లుక్​లో కనిపించారు మహేశ్​. అయితే ఈ పోస్టర్​లో తమన్ పేరు ఉంచింది కానీ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్​ పేరు కనిపించలేదు. దీంతో మళ్లీ నెటిజన్లు అభిమానులు కన్ఫ్యూజన్​లోకి వెళ్లిపోయారు.

మూవీటీమ్​కు మళ్లీ ఏమైంది? పోస్టర్​ను సినిమాట్రోగ్రాఫర్ పేరు లేకుండానే ఎందుకు డిజైన్ చేసిందంటూ చర్చించుకోవడం ప్రారంభించారు. దీంతో మళ్లీ పాత్ర ప్రచారమే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆగిపోయి ఉన్న గుంటూరు కారం షూట్​ ఆగస్ట్ 16నుంచి ప్రారంభం కానుందని, ఈలోగా కొత్త సినిమాటోగ్రాఫర్​ను ఫైనలైజ్ చేసి షూట్ ప్రారంభిస్తారని అని అంటున్నారు. మహేశ్​ 20 నుంచి సెట్స్​లోకి అడుగుపెడతారని చెబుతున్నారు.

చూడాలి మరి నిజంగానే పీఎస్ వినోద్​ సినిమా నుంచి తప్పుకున్నారా? లేదంటే ప్రస్తుతం ఆయనే కొనసాగాలా వద్దా అనే చర్చలు జరుగుతున్నాయా? కొత్త సినిమాటోగ్రాఫర్​ వస్తారా? అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమా విషయానికొస్తే.. సినిమా అనౌన్స్​ మెంట్​ నుంచే షూటింగ్ అండ్ కాస్ట్​ విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. ఇక ఈ చిత్రంలో మొదటగా పూజాహెగ్డేను సెలెక్ట్​ చేసి ఆ తర్వాత శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేశారు. మీనాక్షి చౌదరిని రెండో హీరోయిన్​గా ఎంపిక చేశారు.

Tags:    
  • Gunturkarammovie 
  • MaheshBabu 
  • Trivikram 
  • Tollywood 
  • MovieNews 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS