• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం' ప్రీ...

గుంటూరు కారం' ప్రీ రిలీజ్.. వేదిక ఎక్కడంటే?

| మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'.

By - Tupaki Desk
Update: 2024-01-07 18:19 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. జనవరి 12 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడుతున్న తరుణంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ డీటెయిల్స్ ని ఇటీవలే అధికారికంగా వెల్లడించింది.

జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందని, ఈ ఈవెంట్ లోనే థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయగా అనూహ్యంగా ఈవెంట్ క్యాన్సల్ అవ్వడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. లాస్ట్ మినిట్ లో పర్మిషన్స్ దొరకకపోవడంతో ఈవెంట్ వాయిదా పడింది.

మళ్లీ ఎప్పుడు? ఎక్కడ? నిర్వహిస్తామనేది అధికారికంగా ప్రకటిస్తామని మూవీ టీం వెల్లడించింది. ఈరోజు సాయంత్రం గుంటూరు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అప్డేట్ కూడా బయటకు వచ్చింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఈవెంట్ నిర్వాహకులు ధృవీకరించారు.

జనవరి 9న ఈ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం. మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. నిజానికి మొదట గుంటూరులోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ పర్మిషన్స్ దొరకపోవడంతో మళ్లీ గుంటూరులోనే ఈ ఈవెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఓవర్సీస్ లో అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతోంది.సుమారు 5 వేలకు పైగా లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

జనవరి 11న యూఎస్ లో 5,408కి పైగా స్పెషల్ ప్రీమియర్ షోలని ప్రదర్శించనున్నారు. ఇంత భారీ స్థాయిలో యుఎస్ లో ప్రీమియర్స్ పడనున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం ఓవర్సీస్ లో మహేష్ కు నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉండడంతో అక్కడ భారీ ఎత్తున సినిమాని రిలీజ్ చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    
  • Maheshbabu 
  • Trivikram 
  • Thaman 
  • Prereleaseevent 
  • Guntur 
  • Gunturukaaram 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS