నేపోకిడ్స్ కుళ్లుకునేలా పెర్ఫామ్ చేసాడు
ఇప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ తో పని లేకుండా ఎదిగిన గుల్షన్ దేవయ్య ...డౌన్ టు ఎర్త్ నటిస్తే ఎలా ఉంటుందో చూపించాడు.;
నేపో కిడ్స్ వర్సెస్ ఔట్ సైడర్స్ వార్ ఎప్పటికీ ముగిసిపోనిది. నటవారసులను మించి ఔట్ సైడర్స్ అవకాశాలను అందుకోవడమే గాక, వరుస విజయాలతో దూసుకుపోవడం ఆశ్చర్యపరుస్తోంది. కొన్నిసార్లు ఇది నేపో కిడ్స్ కి సంకటంగా మారుతోంది. ఒక్కోసారి వారు కుళ్లుకునే పరిస్థితి కూడా ఉంది. ఇక రిచ్ పూర్ సీన్ కూడా వీరి మధ్య ఉంది. లైఫ్ లో సెటిలవ్వడం అంటే ధనికులుగా ఉండటం కాదు ప్రభావవంతంగా ఉండటం అని చాలా మంది ఔట్ సైడర్స్ నిరూపిస్తుంటే, అది నేపో కిడ్స్ కి ఇబ్బందికరంగా మారుతోంది.
ఇప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ తో పని లేకుండా ఎదిగిన గుల్షన్ దేవయ్య ...డౌన్ టు ఎర్త్ నటిస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అతడు స్టిల్ ఫోటోగ్రాఫర్ల తో చాలా జోవియల్ గా కనిపించాడు. మార్గం మధ్యలో కింద పడేసిన చెత్త తీసి దూరంగా వెళ్లాడు.. మీరంతా తిన్నారా? అని ఎదుటివారి ఆకలి గురించి ప్రశ్నించాడు.. వెళ్లే ముందు అందరూ తిని వెళ్లండి అని చెప్పాడు. దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పాడు..తన బర్త్ డే కేక్ తేవడంపైనా జోక్ చేసాడు..
కాస్త డౌన్ టు ఎర్త్ నటించండి ప్లీజ్! అని ఫోటోగ్రాఫర్ కోరగానే దేవయ్య సీన్ లోకి ఎంటరయ్యాడు. ఈ మొత్తం దృశ్యం ఆశ్చర్యపరిచింది. మొత్తానికి దేవయ్య లైవ్ పెర్ఫామెన్స్ అందరినీ చాలా ఆకట్టుకుంది.. అహూతులను నవ్వించింది. అతడు స్పాంటేనియస్ గా ఏదైనా చేసి చూపించగలడని నిరూపించాడు. బ్రెయిన్ విత్ పెర్ఫామర్ గా ఆకట్టుకున్నాడు.
`కాంతారా: చాప్టర్ 1` లో రాజు కులశేఖర పాత్రతో సౌత్ లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు దేవయ్య. నిర్లక్ష్యంగా రాజ్యాన్ని పాలించే అసమర్థపు రాజుగా, సోమరివాడిగా, లోలుడిగా అతడి నటన అందరినీ ఆకట్టుకుంది. దేవయ్య ఫోటోగ్రాఫర్లతో కాసేపు సరదాగా చిట్ చాట్ చేస్తూ, అలా డౌన్ టు ఎర్త్ నటించి చూపించడం చాలా మెప్పించింది. అతడి నట ప్రదర్శన కంటే అతడిలోని నిజాయితీ అందరి దృష్టిని ఆకర్షించింది.