పండిట్‌జీకి అవమానం.. భార్య చేసిన పనికి స్టార్ హీరో క్షమాపణలు
ఇటీవల సునీత అహూజా తాను నమ్మే పండిట్ ముఖేష్ శుక్లాని తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడటంపై గోవిందా స్పందించారు.;
ఈ జంట మధ్య గొడవలు ఆగవు.. విడిపోయారని మీడియా హెడ్ లైన్స్ లో పుకార్లు.. అలాగని తమపై సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ జంట వెనకాడరు. తాము విడిపోవడం లేదని, కేవలం గొడవ పడుతున్నామని సదరు సెలబ్రిటీ కపుల్ నిజాయితీగా అంగీకరిస్తారు. ఇంతకీ ఎవరు ఈ జంట? అంటే.. కచ్ఛితంగా బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా, ఆయన సతీమణి సునీతా అహూజా గురించే.
గోవిందా- సునీత అహూజా జంట నడుమ కలతలు ఉన్నాయని, ఈ జంట విడిపోతున్నారని చాలా కాలంగా పుకార్లు ఉన్నాయి. ఆ ఇద్దరూ ప్రస్తుతం కలిసి లేరని, విడివిడిగా వేర్వేరు ఇళ్లలో నివశిస్తున్నారని కూడా హిందీ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే తమ వ్యక్తిగత జీవితంలో మీడియా ప్రమేయంపై ఈ జంట తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. తాము విడిపోవడం లేదని బహిరంగంగానే ఖండిస్తున్నారు.
ఇటీవల సునీత అహూజా తాను నమ్మే పండిట్ ముఖేష్ శుక్లాని తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడటంపై గోవిందా స్పందించారు. తాను ఎంతగానో గౌరవించే, నమ్మే పండిట్ జీపై తన భార్య అవమానకర వ్యాఖ్యలు చేసిందని, దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని గోవిందా అన్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు పండిట్ జీ, ఆయన కుటుంబం నాతో ఉన్నారు. పండిట్ జీ తండ్రి గారు కూడా మాతోనే ఉన్నారు ఎప్పుడూ. వారికి నా హృదయపూర్వక క్షమాపణలు అని గోవిందా అన్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా ఆయన విడదల చేసారు.
ఈ వీడియోలో పండిట్ ముఖేష్ శుక్లాతో తన అనుబంధం గురించి చెబుతూ.. ఏళ్లుగా ఆయన తమ కుటుంబానికి పండిట్ గా ఉన్నారని, వారిపై నా భార్య అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను అని అన్నారు. శుక్లా కుటుంబం కష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిందని గోవిందా తెలిపారు నేను ఆయనను చాలా గౌరవిస్తానని అన్నారు.
సునీత అహూజా పండిట్ జీపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. గోవిందా పండితులను గౌరవించే అలవాటు గురించి చెబుతూ.. సునీత వ్యంగ్యంగా మాట్లాడారు. ``మా ఇంట్లో కూడా గోవింద పండిట్ ఒకరు ఉన్నారు.. అందరు పండితుల ఆలోచనలు సరిగా ఉండవు`` అని అన్నారు. గోవిందా పూజలు చేయించుకుంటాడు. దానికి పండితుడు రూ. 2 లక్షలు వసూలు చేస్తాడు. నీకు నువ్వే ప్రార్థన చేసుకోవాలని నేను గోవిందాకు చెబుతాను.. పండితుల ఆచారాలు నీకు సహాయం చేయవు. నీకు నువ్వు చేసే ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు.. అని చెబుతాను. నేను ఎలాంటి ఆచారాలను నమ్మను.. దానం చేసినా లేదా ఏదైనా మంచి పని చేసినా, నా కర్మ కోసం నా చేతులతోనే చేస్తాను. నమ్మినవాడు భయపడతాడు! అని సునీత అహూజా కటువుగా వ్యాఖ్యానించారు.
గోవిందా చుట్టూ ఉండే వ్యక్తులను అహూజా తిట్టేసారు. ఆయన కూర్చునే సర్కిల్‌లో తక్కువ మతి ఉన్న రచయితలు, ఎక్కువ మూర్ఖపు రచయితలు ఉన్నారు.. వారు అతడిని మూర్ఖుడిని చేస్తారు.. భయంకరమైన సలహా ఇస్తారని అన్నారు. అతను మంచి వ్యక్తులతో ఉండడు.. నేను నిజం మాట్లాడటం వలన వారు నన్ను ఇష్టపడరు అని సునీత అహూజా తిట్టారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గోవిందా నిరభ్యంతరంగా ఇప్పుడు పండిట్‌లకు రచయితలకు సారీ చెబుతున్నాడు.
గోవిందా- సునీత అహూజా ప్రేమకథ ఒక సినిమా కథకు తక్కువేమీ కాదు. 1987 లో గోవింద- సునీతా అహుజా వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు యశ్వర్ధన్ , కుమార్తె టీనా అహుజా.