• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వం.. పెళ్లిలో...

విశ్వం.. పెళ్లిలో గోపిచంద్ బుల్లెట్ల మోత!

| చివరగా వచ్చిన బీమా సినిమా కాస్త పరవాలేదు అనిపించినప్పటికీ కమర్షియల్ గా మాత్రం పూర్తి స్థాయిలో లాభాలను అందించలేకపోయింది.

By - Tupaki Desk
Update: 2024-04-11 12:28 GMT

యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ చాలా కాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. అతను బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయింది. చివరగా వచ్చిన బీమా సినిమా కాస్త పరవాలేదు అనిపించినప్పటికీ కమర్షియల్ గా మాత్రం పూర్తి స్థాయిలో లాభాలను అందించలేకపోయింది.


ఇక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల తో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నాడు. చాలా రోజులుగా విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీనువైట్లకు కూడా ఈ మూవీ చాలా కీలకం కానుంది. ఎందుకంటే చాలా కాలంగా ఆయన కూడా సక్సెస్ చూడలేదు.

కాబట్టి ఈ సినిమాతో ఈ కాంబినేషన్ తప్పనిసరిగా మంచి హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఫస్ట్ స్ట్రైక్ అంటూ ఒక టీజర్ విడుదల చేశారు. విశ్వం అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో గోపీచంద్ గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లు ఇదివరకే దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక ఈ ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ ఒక గన్నుతో పెళ్లిలోకి వెళ్లి అక్కడ అందర్నీ చంపేసిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అందరూ సంతోషంగా పెళ్లి చేసుకుంటున్న సమయంలో గోపీచంద్ ఎందుకు వారందరిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఒకవేళ అతను ఇందులో సీరియల్ కిల్లరా? లేదంటే దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? అంతేకాకుండా గోపీచంద్ నెగటివ్ షెడ్ లో కూడా కనిపిస్తున్నాడా అనే డౌట్స్ కూడా క్రియేట్ చేశారు.

గోపీచంద్ మొదట విలన్ గానే క్లిక్కయ్యాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక శ్రీనువైట్ల ఈసారి విశ్వంలో ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ స్ట్రైక్ అయితే బాగానే హైలెట్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఒక కావ్య థాపర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Full View
Tags:    
  • Viswam 
  • ViswamFirstStrike 
  • Gopichand 
  • SreenuVaitla 
  • FirstStrike 
  • EidSpecial 
  • TgVishwaPrasad 
  • VenuDonepudi 
  • PeopleMediaFactory 
  • ChitralayamStudios 
  • ChaitanBharadwaj 

Similar News

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Copyright @2026

Powered by Blink CMS