ఘాజి దర్శకుడితో గోపిచంద్.. గోపీచంద్ నెవ్వర్ బిఫోర్ గ్లింప్స్!

నేడు గోపీచంద్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ రెండూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.;

Update: 2025-06-12 04:42 GMT

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఐబీ 7, ఘాజీ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరగ్గా.. ఇప్పుడు మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇండియన్ హిస్టరీలో కీలకమైన, మరచిపోలేని సంఘటనలతో రూపొందిస్తున్న ఆ సినిమాలో గోపీచంద్ నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసి అంచనాలు పెంచారు.

7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతుండగా.. మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. నేడు గోపీచంద్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ రెండూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

పోస్టర్ ను గోపీచంద్ వేరే లెవెల్ లో ఉన్నారు. గోపీచంద్ పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, నుదుటన సింధూరం, చేతిలో కత్తి, దీర్ఘంగా చూస్తున్న కళ్లతో యోధుడుగా కనిపించారు. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న పోస్టర్.. పవర్ ఫుల్ గా ఉంటూ అబ్బురపరుస్తుంది. నెటిజన్లు, సినీ ప్రియులు.. పోస్టర్ అదుర్స్ అని చెబుతున్నారు.

మరోవైపు, గ్లింప్స్ అయితే ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. మంచు కొండల సీన్ కూల్ గా స్టార్ట్ అవుతుంది. అప్పుడే గూడారం నుంచి యోధుడుగా గోపీచంద్ బయటకు వస్తారు. తన గుర్రంతో ఆత్మీయంగా గడుపుతారు. బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ధీర సాంగ్.. అదిరిపోయింది. విజువల్స్ చాలా రిచ్ గా ఉండి బాగున్నాయి.

మొత్తానికి సినిమాలో గోపీచంద్ ఎప్పుడూ చూడని పాత్రలో కనిపిస్తారని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో ఏప్రిల్ లో కంప్లీట్ చేశారు మేకర్స్. కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. భారీ సెట్ లో ఇప్పుడు చిత్రీకరణ జరుగుతోంది. క్యాస్టింగ్ తో పాటు సాంకేతిక సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Full View
Tags:    

Similar News