వారణసి ఈవెంట్.. రాజమౌళి మీద కేసు..?
గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ గా మహేష్ వారణాసి సినిమా ఈవెంట్ లో రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఆయన ఎప్పుడు లేని విధంగా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారారు.;
గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ గా మహేష్ వారణాసి సినిమా ఈవెంట్ లో రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఆయన ఎప్పుడు లేని విధంగా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారారు. ముఖ్యంగా దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, భార్య రమా రాజమౌళి హనుమాన్ ను నమ్ముతారు. కానీ ఇలానేనా జరిగేది అని వారణాసి గ్లింప్స్ లేట్ అవ్వడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐతే ఈ విషయం చిలికి చిలికి గాలి వాన అయినట్టుగా ఇప్పుడు ఏకంగా కేసు పెట్టే స్థాయికి వెళ్లింది.
రాజమౌళి మీద ట్రోల్స్..
వారణాసి ఈవెంట్ లో హనుమంతుడు మీద రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. దీనికి రాజమౌళి వివరణ ఇవ్వాల్సిందే అని వారు కోరుతున్నారు. ఐతే వారణాసి ఈవెంట్ లో రాజమౌళి కేవలం తన గ్లింప్స్ లేటైందన్న రీజన్ తో ఆయన అలా మాట్లాడారే తప్ప నిజంగానే ఆయనకు నమ్మకం లేదన్నట్టు కాదు.
ఆ టైం లో రాజమౌళి ఎంతో అప్సెట్ అయ్యి ఎమోషనల్ అయ్యాడు. అందుకే అలా మాట్లాడాడు. ఐతే ఆ కామెంట్స్ ని పట్టుకుని రాజమౌళి మీద ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు. దేవుడంటే నమ్మకం లేని రాజమౌళి దేవుడి సినిమాలు ఎందుకు చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే రాజమౌళి ఎప్పుడు లేని విధంగా వారణాసి ఈవెంట్ స్పీచ్ తో కొంత నెగిటివిటీ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.
రాష్ట్రీయ వానరసేన కేసు ఫిర్యాదు..
ఐతే రాజమౌళి కామెంట్స్ ని ట్రోల్స్ చేస్తున్న వారు కొందరైతే.. రాష్ట్రీయ వానరసేన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. మరి ఈ విషయంపై రాజమౌళి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది చూడాలి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు తన ప్రతి యాక్టివిటీని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న రాజమౌళి ఇలా వారణాసి ఈవెంట్ తో ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. మరి జక్కన్న ఈ విషయాలపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
మహేష్ తో 15 ఏళ్ల క్రితమే సినిమా చేయాలని ఫిక్స్ అయిన రాజమౌళి. ఇన్నాళ్లకు ఆ సినిమా తీసే ఛాన్స్ తీసుకున్నాడు. వారణాసి టైటిల్ తో పాటు గ్లింప్స్ తో ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేశాడు రాజమౌళి. అంతేకాదు ఈవెంట్ లో మహేష్ ఎంట్రీ, ఆయన లుక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఐతే ఆ గ్లింప్స్ రిలీజ్ టైం లోనే కొంత ఆలస్యం అయ్యింది. ఆ టైంలోనే రాజమౌళి కాస్త అప్సెట్ గా అనిపించారు.