గెటప్ శ్రీను, జాఫర్ ఇష్యూ.. నిజమేనా?

స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు ఎదిగిన యాక్టర్ కమ్ కమెడియన్ గెటప్ శ్రీను మరోసారి వార్తల్లో నిలిచారు.;

Update: 2026-05-01 13:26 GMT

స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ కు ఎదిగిన యాక్టర్ కమ్ కమెడియన్ గెటప్ శ్రీను మరోసారి వార్తల్లో నిలిచారు. బుల్లితెరపై కామెడీ షోలతో కెరీర్ ప్రారంభించిన ఆయన, ఇప్పుడు వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన పేరు మళ్లీీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం యాంకర్ జాఫర్‌ తో జరిగిన ఓ ఇంటర్వ్యూ క్లిప్.

ఇటీవల బయటకు వచ్చిన వీడియోలో జాఫర్, గెటప్ శ్రీనును ఇంటర్వ్యూ చేస్తూ ఆయన తాజా ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తారు. దానికి స్పందించిన శ్రీను, తన చివరి సినిమా మంచి విజయాన్ని సాధించిందని చెబుతూ, తదుపరి ప్రాజెక్ట్‌ గా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడిస్తారు. ఆ సిరీస్‌ ను నాగబాబుతో కలిసి చేస్తున్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే అసలు హైలైట్ ఆ వెబ్ సిరీస్ టైటిల్ దగ్గరే వచ్చింది.

మేము కాపులం అనే టైటిల్ తనకు బాగా నచ్చిందని గెటప్ శ్రీను చెప్పగానే జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ టైటిల్ కులాన్ని ప్రస్తావిస్తున్నందున సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా కోసం కులాన్ని వాడుకోవడం సరైన పద్ధతి కాదని ప్రశ్నించారు. జాఫర్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా ఇంటర్వ్యూను సీరియస్ మోడ్ లోకి తీసుకెళ్లాయి. శ్రీను కథ, క్యారెక్టరైజేషన్ అన్నీ బాగున్నాయని చెప్పినా, జాఫర్ మాత్రం టైటిల్‌ పై ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఇలాంటి టైటిల్స్ కాంట్రవర్సీ కోసం పెట్టారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాల ఉదాహరణను కూడా ప్రస్తావించారు.

వరుస ప్రశ్నలకు శ్రీను సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినా, జాఫర్ ఆగకుండా ప్రశ్నలు వేశారు. చివరికి కోపానికి గురైన గెటప్ శ్రీను చెయిర్‌ ను నెట్టేసి తొక్కలో ఇంటర్వ్యూ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది నిజంగా జరిగిన డిస్కషన్ అని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ అని అంటున్నారు.

ముఖ్యంగా వెబ్ సిరీస్ టైటిల్‌ ను ప్రమోట్ చేయడానికి ఆ డ్రామా క్రియేట్ చేశారని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అయితే ఇది సరదాగా చేసిన కామెడీ ప్రోమో మాత్రమేనని చెబుతున్నారు. ఇటీవల కాలంలో వెబ్ సిరీస్‌ లు, సినిమాల కోసం క్రియేటివ్ ప్రమోషన్స్ పెరిగాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు మేకర్స్ వివిధ రకాల స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో గెటప్ శ్రీను-జాఫర్ వీడియో కూడా అలాంటి ప్రయత్నమే కావచ్చనే సందేహం వ్యక్తమవుతోంది.

ఇదంతా నిజంగా జరిగిన సంఘటనా? లేక ప్రీ-ప్లాన్డ్ ప్రమోషనా? అన్నది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనిపై గెటప్ శ్రీను లేదా జాఫర్ అధికారికంగా స్పందిస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. మొత్తానికి, ఒక చిన్న వీడియో క్లిప్ చుట్టూ పెద్ద చర్చ మొదలైంది. అదే సమయంలో మేము కాపులం వెబ్ సిరీస్‌ పై ఆసక్తిని పెంచడంలో ఆ వీడియో క్లిప్ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి.

Tags:    

Similar News