మూడేళ్లుగా రితేష్ టార్చర్ భరించలేకపోయా!
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని క్యారెక్టర్లు కొందరి కోసమే స్పెషల్ గా పుట్టుకొచ్చాయని అనిపిస్తుంటుంది. అలా తెలుగు ఆడియన్స్ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన క్యారెక్టర్ హాసిని. హా..హా.. హాసినీ అంటూ ఆ పాత్రలో జెనీలియా ఎంతో ఒదిగిపోయారు.;
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని క్యారెక్టర్లు కొందరి కోసమే స్పెషల్ గా పుట్టుకొచ్చాయని అనిపిస్తుంటుంది. అలా తెలుగు ఆడియన్స్ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన క్యారెక్టర్ హాసిని. హా..హా.. హాసినీ అంటూ ఆ పాత్రలో జెనీలియా ఎంతో ఒదిగిపోయారు. తెలుగు ప్రేక్షకులకు ఎవరికైనా సరే జెనీలియా అనగానే వెంటనే గుర్తొచ్చేది బొమ్మరిల్లు సినిమా, అందులోని హాసిని క్యారెక్టరే.
బాయ్స్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న జెనీలియా ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో ఎంతో మంది యూత్ కు ఫేవరెట్ గా నిలిచిన జెనీలియా బొమ్మరిల్లు తో పాటూ రెడీ, ఢీ, సై అనే పలు హిట్లు సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న జెనీలియా ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా వారి ఆలనా పాలనాతో పాటూ కుటుంబ వ్యవహారాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లవడంతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇచ్చి స్టార్‌డమ్ ను తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు జెన్నీ. అందులో భాగంగానే మొన్నామధ్య మరాఠాలో వేద్ అనే సినిమా చేశారు. మజిలీ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది.
రీసెంట్ గా సితారే జమీన్ పర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న జెనీలియా ఇప్పుడు జూనియర్ అనే సినిమాతో 13 ఏళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్ కు కంబ్యాక్ ఇస్తున్నారు. కిరిటీ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన జూనియర్ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో కనిపించారు. అందులో భాగంగానే జూనియర్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న జెనీలియా తన భర్త రితేష్ పై సంచలన కామెంట్స్ చేశారు.
13 ఏళ్లుగా భర్త, పిల్లలతో చాలా హ్యాపీ లైఫ్ ను గడిపానని చెప్పిన జెనీలియా గత మూడేళ్లుగా తన భర్త రితేష్ తనను టార్చర్ చేస్తున్నడని చెప్పారు. ఫ్యామిలీ లైఫ్ చాలు, పిల్లలు కూడా పెద్దవాళ్లు అవుతున్నారు. ఇక రీఎంట్రీ ఇవ్వు అని డైలీ తనను టార్చర్ చేస్తున్నాడని, అతని టార్చర్ భరించలేకే 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చానని చెప్పిన జెనీలియా, తెలుగు ఆడియన్స్ హాసినిగా తనను గుర్తుపెట్టుకున్నారని, తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించాలనుందని తెలిపారు.