గుర్తు పట్టారా... ఈమె ఆమెనే!
తెలుగు సినిమా ఉన్నంత కాలం నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం.;
తెలుగు సినిమా ఉన్నంత కాలం నాగార్జున హీరోగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇండియన్ సినిమా చరిత్రలో గీతాంజలి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నాగార్జునకు జోడీగా ఆ సినిమాలో గిరిజ హీరోయిన్‌గా నటించింది. సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా గీతాంజలి, ప్రకాష్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. గీతాంజలి అనే అమ్మాయి మన పక్కింటి అమ్మాయి అన్నట్లుగా అనిపిస్తుంది. మన ఇంట్లో అమ్మాయికి కష్టం వచ్చింది? మన ఇంట్లో ఉండే అల్లరి అమ్మాయిగా గీతాంజలి అనిపించింది. గీతాంజలి పాత్ర చేయడం ద్వారా గిరిజ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా గిరిజ కి మంచి ఫాలోయింగ్ దక్కింది. కానీ ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు.
జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి టాక్ షో
1989లో వచ్చిన 'గీతాంజలి' సినిమాలో నాగార్జున కు జోడీగా నటించిన గిరిజ మళ్లీ ఇన్నాళ్లకు ఆయన గురించి మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ జగపతిబాబు హోస్ట్‌గా జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి టాక్ షో లో మొదటి గెస్ట్‌గా నాగార్జున పాల్గొన్నాడు. ఇప్పటికే చాలా టాక్ షో లు ఉన్నాయి. అయినా కూడా జగ్గూ భాయ్ టాక్ షో కి మంచి స్పందన దక్కింది. నాగార్జున మాత్రమే కాకుండా ఆయన సోదరుడు అక్కినేని వెంకట్‌తో పాటు, ఆయన సోదరి సైతం పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ షో లో ఎన్నో విషయాలను చర్చించడం జరిగింది. మంచి స్పందన దక్కింది. ఎపిసోడ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది.
గీతాంజలి హీరోయిన్ గిరిజ న్యూ లుక్
ఈ ఎపిసోడ్ కి గీతాంజలి హీరోయిన్ గిరిజ వీడియో బైట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీడియో బైట్ లో గిరిజ మాట్లాడుతూ నాగార్జున గురించి మాట్లాడింది. నా మొదటి సినిమా కో స్టార్ నాగ్ కావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయనతో చేసే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని. ఆయన గొప్ప మనిషి, లెజెండ్ నటుడు అనడంలో సందేహం లేదు. నాగ్ సర్‌లో మంచి హాస్యం ఉంటుంది. ఆయన ప్రతి విషయంలోనూ నాకు చాలా మద్దతుగా ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు చాలా విషయాలు నేర్పిన నాగ్ సర్‌కి కృతజ్ఞతలు అన్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా గిరిజ ఎక్కువగా మీడియా ముందుకు రాదు. కనుక ఈ టాక్ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
నాగార్జున గురించి గిరిజ కామెంట్స్
గిరిజ చాలా చిన్న వయసులోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. గిరిజ ఈ టాక్ షో లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. చాలా ఏళ్ల తర్వాత గిరిజను చూసిన వారు బాబోయ్ ఇంత మార్పు ఏంటి అంటూ చాలా మంది షాక్ అవుతున్నారు. చాలా మంది కనీసం గుర్తు పట్టడం లేదు. సోషల్ మీడియాలో ఈమె గీతాంజలి హీరోయిన్ అంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె వైరల్ అవుతోంది. గిరిజ సినిమాలు ఎందుకు మానేసింది అంటూ చాలా మంది ఈ ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. అందుకే గిరిజ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.