తరుణ్ భాస్కర్ బిజినెస్ లెక్కలు.. అప్పుడే ఎలా సాధ్యం?
ఇప్పుడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గాయపడ్డ సింహం: Vol 1.5పై కూడా సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది.;
టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన.. కొంతకాలంగా నటుడిగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గాయపడ్డ సింహం: Vol 1.5పై కూడా సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
ఆ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ బ్యూటీస్ మానస చౌదరీ, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ మూవీ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిస్తున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఓ యువకుడి జీవితం ఎలా మారిపోతుందన్న నేపథ్యంతో కథ సాగుతుందని తెలుస్తోంది.
అయితే సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. విడుదలైన టీజర్ తో పాటు థీమ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమెరికా వెళ్లాలనే హీరో కలలు ఎలా నిలిచిపోయాయో చూపిస్తూ వచ్చిన పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫన్నీ టచ్ తో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పుడు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం జోరుగా చర్చ జరుగుతోంది. విడుదలకు ముందే పూర్తి చేసుకుందని సమాచారం. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా సుమారు రూ.9 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ హక్కుల ద్వారా దాదాపు రూ.6 కోట్లు వచ్చినట్లు టాక్. మొత్తం మీద విడుదలకు ముందే సినిమాకు సుమారు రూ.15 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు వినికిడి.
అయితే సినిమా బడ్జెట్ సుమారు రూ.12 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఇప్పటికే ఆ మొత్తాన్ని మించి వచ్చినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లే అని అంతా చెబుతున్నారు. కాగా.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇది ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సినిమాకు వచ్చిన బజ్ నే అందుకు ప్రధాన కారణమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే టీజర్ తో పాటు ఒక్క పాటతోనే చిత్రంపై హైప్ పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. యూత్ ను ఆకట్టుకునే కథ, తరుణ్ భాస్కర్ స్టైల్ హ్యూమర్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కలిసి సినిమాకు ముందే క్రేజ్ తీసుకువచ్చాయని చెప్పాలి. మరి మూవీ విడుదలైన తర్వాత ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.