తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' న్యూ సాంగ్.. ఫరియాతో సూపర్ డ్యాన్స్..

ఆమె తన ఎనర్జీతో డ్యాన్స్ ఫ్లోర్‌ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. స్టైలిష్ లుక్స్‌ తో పాటు డ్యాన్స్‌ లో చూపించిన ఈజ్, గ్రేస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.;

Update: 2026-04-01 16:44 GMT

టాలీవుడ్‌ లో కొత్త తరహా కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న గాయపడ్డ సింహంపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటి ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ మూవీ గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఆ సినిమా నుంచి రెండో సింగిల్‌ బ్రైడ్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ యూత్ ను ఆకట్టుకుంటోంది.

బ్రైడ్ సాంగ్ ను మేకర్స్ పూర్తిగా కలర్‌ ఫుల్, ట్రెండీగా రూపొందించారు. ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్‌ ను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ పాటను తెరకెక్కించడం విశేషం. పెళ్లి నేపథ్యంతో సాగుతున్న ఆ సాంగ్ లో నేటి యువత ఆలోచనా విధానం, సోషల్ మీడియాలో ప్రాధాన్యం పొందాలనే కోరికలను వినూత్నంగా చూపించారని చెప్పాలి.

సాంగ్ కు స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించడమే కాకుండా ఇంగ్లీష్ లిరిక్స్ కూడా రాశారు. తెలుగు పదాలను స్టార్ రైటర్ శ్రీమణి అందించారు. గాయని మనీషా ఈరబతిని తన స్వరంతో పాటకు కావాల్సిన ట్రెండీ ఫీల్‌ ను తీసుకొచ్చారు. సంగీతం, లిరిక్స్, వాయిస్.. అన్నీ కలిసొచ్చి వినసొంపుగా మార్చాయి. ముఖ్యంగా ఫరియా అబ్దుల్లా డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

ఆమె తన ఎనర్జీతో డ్యాన్స్ ఫ్లోర్‌ ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. స్టైలిష్ లుక్స్‌ తో పాటు డ్యాన్స్‌ లో చూపించిన ఈజ్, గ్రేస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఒకవైపు ట్రెడిషనల్ దేశీ గర్ల్ లుక్‌ లో కనిపిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో ఎఫెక్ట్ చూపించే యువతిని రిఫ్లెక్ట్ చేసేలా ఆమె నటన ఉంది. తరుణ్ భాస్కర్ కూడా ఆ పాటలో ఫరియాతో కలిసి స్టెప్పులు వేస్తూ అలరించారు.

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్ గా కనిపిస్తూ.. పాటకు మరింత బలాన్ని అందించింది. స్క్రీన్‌ పై వీరి జోడీ కొత్తగా, ఫ్రెష్‌ గా అనిపిస్తోంది. ఆ పాటలోని విజువల్స్ కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. గ్రాండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ తో సాంగ్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కలర్‌ ఫుల్ సెట్స్, స్టైలిష్ ఫ్రేమ్స్, మోడర్న్ ట్రీట్మెంట్.. అన్నీ కలిపి ఆ సాంగ్‌ ను విజువల్ ఫీస్ట్‌ గా మార్చాయి.

గాయపడ్డ సింహం చిత్రాన్ని పవన్ సాధినేని సమర్పిస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సల్, భాను ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, కళ్యాణ్ చక్రవర్తి మందిన నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ ఆ చిత్రానికి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ యూత్ అమెరికాలో సెటిల్ కావాలనే ఆశయాలను నేపథ్యంగా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏదేమైనా బ్రైడ్ సాంగ్ తో గాయపడ్డ సింహంపై అంచనాలు మరింత పెరిగాయి.


Full View
Tags:    

Similar News