వార‌సుల్లో అత‌డొక్క‌డే దూకుడుగా!

ఆర్డ‌ర్ ప్ర‌కారం చూస్తే మోక్ష‌జ్ఞ ముందుగా లాంచ్ అవ్వాలి. అనంత‌రం గౌత‌మ్, లైన్ లో ఉన్నారు. కానీ ఈ ఆర్డ‌ర్ ప్ర‌కారం లాంచింగ్ క‌ష్టంగానే క‌నిపిస్తోంది.;

Update: 2026-03-11 08:30 GMT

టాలీవుడ్ లో వార‌సుల ఎంట్రీపై నిరంత‌రం చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. న‌టసింహ బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు అకీరానంద‌న్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్ లాంచింగ్ పై ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతుంది. ఆర్డ‌ర్ ప్ర‌కారం చూస్తే మోక్ష‌జ్ఞ ముందుగా లాంచ్ అవ్వాలి. అనంత‌రం గౌత‌మ్, లైన్ లో ఉన్నారు. కానీ ఈ ఆర్డ‌ర్ ప్ర‌కారం లాంచింగ్ క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే మోక్షజ్ఞ, అకీరా నందన్ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా? ప్రాక్టికల్‌గా చూస్తే గౌతమ్ వారందరికంటే ముందే వెండితెరపై హీరోగా మెరిసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సాధారణంగా స్టార్ కిడ్స్ నేరుగా వెండితెరపైనే కనిపిస్తారు. కానీ గౌతమ్ రూట్ మాత్రం భిన్నంగా ఉంది. గౌత‌మ్ ఇప్పటికే లండన్‌లో న‌ట‌న‌కు సంబంధించి శిక్షణ పొందుతున్నాడు. పలు స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లతో అద‌ర గొడుతున్నాడు. ఇటీవల గౌత‌మ్ స్టేజ్ షోలతో అతని నటన , న‌మ్మ‌కం చూస్తుంటే ఎంత ఫ్యాష‌న్ గా ఉన్నాడు? అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. అలాగే షార్ట్ ఫిలిమ్స్ , ఇండిపెండెంట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ఇంట్రెస్టింగ్.త‌న ట్యాలెంట్ కేవ‌లం వెండి తెర‌పై నిరూపించుకోక ముందే? నటనలోని మెళకువలను తెలుసుకోవడానికి ల‌ఘు చిత్రాల్లో న‌టిస్తూ కెమెరా ఫియర్ ని పొగొట్టుకుంటున్నాడు.

కానీ మోక్షజ్ఞ, అకీరా నందన్ మాత్రం ఇంకా తొలి అడుగులు చర్చల దశలోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఆ మ‌ధ్య మోక్ష‌జ్ఞ లాంచ్ అవుతున్నాడ‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌నొచ్చినా? అది అక్క‌డికే ప‌రిమిత‌మైంది. అకీరా విష‌యంలో మాత్రం అప్ డేట్ కూడా క‌రువైంది. గౌత‌మ్ ఏడాది కాలంగా బాడీ లాంగ్వేజ్, ఫిట్‌నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. మీడియా అటెన్ష‌న్ డ్రా చేయ‌డంలో గౌత‌మ్ స‌క్స‌స్ అవుతున్నాడు. రేర్ గా ఫ్యామిలీ ఆకేష‌న్స‌ల్ లో క‌నిపించ‌డం.. వ్య‌క్తిగ‌త ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం వంటివి గౌత‌మ్ కి క‌లిసొస్తున్నాయి. వెనుక నుంచి మామ్ న‌మ్ర‌త కూడా గౌత‌మ్ కోసం ఎంతో వ‌ర్క్ చేస్తున్నారు.

కానీ మోక్షజ్ఞ‌, అకీరా విష‌యంలో ఇలాంటివి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మోక్ష‌జ్ఞ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిపా? మేకోవ‌ర్ అవుతున్నా? అత‌డికి ఇప్ప‌టికే 31 ఏళ్లు నిండాయి. ఇప్ప‌టికే లాంచింగ్ జ‌రిగిపోయి ఓ పెద్ద స్టార్ పొజిష‌న్ లో ఉండాలి. కానీ అత‌డు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. ఎలాంటి ల‌ఘు చిత్రాలు గానీ, న‌ట‌న‌లో టెక్నిక్స్ గానీ తెలుసుకుంటున్నట్లు క‌నిపించ‌లేదు. అకీరానంద‌న్ విష‌యంలోనూ ఇదే స‌న్నివేశం క‌నిపిస్తుంది. గౌత‌మ్ విష‌యంలో అన్నీ అనుకుంటున్న‌ట్లు జ‌రిగితే గ‌నుక అత‌డి లాంచింగ్ మ‌రో ఏడాదిలోనే ఉండొచ్చు.

Tags:    

Similar News