ఫిర్యాదులొచ్చినా స్టార్ వైఫ్ రెస్టారెంట్ క్రేజీ
ఇప్పుడు తమ చిత్త శుద్ధి నిరూపించినందున తనకు ఇన్ స్టాలో మరింత ఫాలోయింగ్ పెరిగిందని, రెస్టారెంట్ కస్టమర్లు కూడా పెరిగారని అతడు అంటున్నాడు.;
రోడ్ పక్కన ఉన్న కాకా హోటల్ పై ఆరోపించినంత సులువురుగా కింగ్ ఖాన్ - గౌరీ ఖాన్ జంట సొంత రెస్టారెంట్ 'టోరి'పై ఆరోపించాడు యూట్యూబ్ చానెల్ అధినేత. టోరి హోటల్‌లో నకిలీ పనీర్ ను కస్టమర్ కి అందిస్తున్నారని ప్రముఖ యూట్యూబర్ సార్థక్ సచ్ దేవా ఆరోపించారు. ఈ ఆరోపణలు క్షణాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అయోడిన్ పరీక్షలో స్టార్చ్ ఉందని యూట్యూబర్ నిరూపించారు.
సోయా ఆధారిత పదార్థాలలో స్టార్చ్ ఉంటుంది. కానీ పనీర్ నకిలీదని నిర్ధారించలేదు. అయితే తమపై ఆరోపణలు రాగానే దానిని తిప్పి కొట్టేందుకు 'టోరి' హెడ్ చెఫ్ స్టీఫెన్ చేసిన ప్రయత్నం సఫలమైంది. రెస్టారెంట్‌పై ఆరోపణలు రాగానే, టోరీ ఒక ప్రకటన విడుదల చేసింది. తాము నాణ్యమైన పనీర్ ని అందిస్తున్నామని, అన్ని పదార్థాలు అధిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. నియమ నిబంధనల విషయంలో టోరి రాజీ పడదని కూడా హెడ్ చెఫ్ స్టీఫెన్ గాడిట్ చెప్పారు.
ఇప్పుడు తమ చిత్త శుద్ధి నిరూపించినందున తనకు ఇన్ స్టాలో మరింత ఫాలోయింగ్ పెరిగిందని, రెస్టారెంట్ కస్టమర్లు కూడా పెరిగారని అతడు అంటున్నాడు. మేం సార్థక్ తో మాట్లాడాం.. పరిస్థితిని అర్థం చేసుకుని ఆ పోస్ట్ ని తొలగించాడని తెలిపారు. అంతే కాదు... జరిగిన దానిని ''వేషంలో దీవెన'' అని వర్ణించాడు. మొత్తానికి ఇది తప్పు అని నెగెటివ్ ప్రచారం జరిగినా ఒక్కోసారి మేలు జరుగుతుందని కూడా చెఫ్ స్టీఫెన్ అన్నారు. ఈ మొత్తం వివాదంలో తమపై ఆరోపణ రాగానే, అది తప్పుడు ఆరోపణ అని నిరూపిస్తూ వెంటనే స్పందించడం కలిసొచ్చిందని వారు పేర్కొన్నారు. టోరి ఇప్పుడు మరింత పారదర్శకతతో రుచికరమైన, నాణ్యమైన ఆహారపదార్థాలను కస్టమర్లకు అందిస్తోంది.