GOG రిలీజ్ ట్విస్ట్.. మరో న్యూ డేట్ ఫిక్స్

ఇక చాలాకాలంగా ఈ సినిమా విడుదల కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా కొన్నిసార్లు వాయిదా పడింది

Update: 2024-05-09 10:28 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల హడావిడి ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. టిల్లు స్క్వేర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిన సినిమా పడలేదు. అయితే నెక్స్ట్ అందరి ఫోకస్ మాత్రం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పైన ఉంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇక చాలాకాలంగా ఈ సినిమా విడుదల కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. మరో 9 రోజుల్లో రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మరో కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకుగల కారణం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే.

విశ్వక్ ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త తరహా కథను హైలైట్ చేస్తూ ఉన్నాడు. చివరిగా అతని నుంచి వచ్చిన గామీ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో అఘోరా పాత్రలో కనిపించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కంప్లీట్ మాస్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఒక సాధారణ యువకుడిగా ఉండే అతను బలమైన వ్యక్తులను ఎదురించి పొలిటికల్ లీడర్ గా ఎలా ఎదిగాడు అనే స్టోరీ లైన్ తో సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

Read more!

ఇప్పటికే టీజర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. విడుదలైన పోస్టర్లు సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక సినిమాను మే 17వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ ప్రణాళికలు మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు గల ముఖ్య కారణం.. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండడం. అంతే కాకుండా మరోవైపు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కూడా బాక్సాఫీస్ పై ప్రభావం చూపిస్తున్నాయి.

మరోవైపు సమ్మర్ తాకిడి కూడా గట్టిగానే ఉంది. నెక్స్ట్ వారం నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి ఈ టైమ్ లో ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదు అని మేకర్స్ ఒక పర్ఫెక్ట్ డేట్ ఐతే ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల హడావుడి పూర్తయిన తర్వాత మే 31వ తేదీన కూల్ గా సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక విధంగా సినిమాకు అన్ని విధాలుగా అది పర్ఫెక్ట్ డేట్ అని చెప్పవచ్చు. ఆ సమయానికి ఎండల వేడి తగ్గుతుంది. అలాగే స్టూడెంట్స్ కి మరి కొన్ని రోజుల వరకు హాలిడేస్ కూడా ఉంటాయి. సమ్మర్ లో బెస్ట్ సినిమా చూడలేదని ఫీల్ అవుతున్న వారికి GOG బెస్ట్ అప్షన్ గా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ కొత్త డేట్ విషయంలో మేకర్స్ ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News