GOG.. ఊరమాస్ 'బ్యాడ్' సాంగ్

మాస్ కా దాస్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నారు. సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి ఆడియన్స్‌ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు

Update: 2024-05-10 07:05 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'ఫలక్ నామా దాస్' సినిమా గుర్తుందా? చెప్పాలంటే ఆ మూవీతోనే విశ్వక్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. మాస్ కా దాస్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నారు. సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి ఆడియన్స్‌ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు. ఐదేళ్ల క్రితం మే 31న రిలీజ్ అయిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

ఇప్పుడు అదే తేదీన విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రాబోతోంది. ఛల్‌ మోహన్‌ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్‌.. గ్యాంగ్‌ స్టర్‌ రోల్ లో కనిపించనున్నారు. లంకల రత్నగా అలరించనున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సరసన డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్‌ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇటీవల హీరోహీరోయిన్ల లిప్‌ లాక్‌ పోస్టర్‌ ను విడుదల చేసిన మేకర్స్.. రీసెంట్ గా బ్యాడ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. మాస్ కా దాస్ కత్తి చేతపట్టుకొని శత్రువులను చీల్చి చెండాతున్నట్టుగా ఉన్న పోస్టర్‌ షేర్ చేస్తూ మే10న లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు. చెప్పినట్లే శుక్రవారం ఉదయం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్- ' బ్యాడ్ ' లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

Read more!

అడవికి గొడ్డలి, కడుపుకి అంబలి, కత్తికి కోబలి, మట్టికి నాగలి అంటూ ర్యాప్ తో స్టార్ట్ అయిన ఈ 'బ్యాడ్' సాంగ్ అదిరిపోయింది. సాంగ్ మధ్యలో విశ్వక్ లుక్స్ ఓ రేంజ్ లో, ఊర మాస్ గా ఉన్నాయి. డబ్బులు, తుపాకీలు, బుల్లెట్లను చూపిస్తూ మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచారు. మొత్తానికి ఈ సాంగ్ కూడా రికార్డులు సృష్టించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే సుట్టంలా సూసి సాంగ్‌ మిలియన్ల వ్యూస్ రాబడుతోంది.

ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో నేహా శెట్టితో పాటు అంజలి ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఫలక్‌ నామా దాస్ రిలీజ్ అయిన రోజే.. విడుదలకు సిద్ధమవుతున్న గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమా హిస్టరీ రిపీట్‌ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News