పిక్‌టాక్ : గణేషుని పూజలో ముగ్గురు హీరోయిన్స్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఒకానొక సమయంలో ఫుల్‌ బిజీగా వరుస సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.;

Update: 2025-08-28 07:03 GMT

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్స్‌లో చాలా మంది గణేష్ పూజలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ల ద్వారా షేర్‌ చేస్తున్నారు. సాధారణంగా ఎవరి ఇంట్లో వారు గణేషుని పూజ చేసుకుని, వారి ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్‌కి చెందిన ముగ్గురు హీరోయిన్స్ ఒకే చోట కూడి గణేష్ పూజలో పాల్గొన్నారు. రకుల్‌ ప్రీత్ సింగ్‌, మృణాల్‌ ఠాకూర్‌, ప్రగ్యా జైస్వాల్‌ ముగ్గురు కలిసి ఒకే చోట పూజలో పాల్గొన్నారు. వీరితో పాటు, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా వీరు షేర్‌ చేసిన ఫోటోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ముగ్గురు హీరోయిన్స్ కూడా పద్దతిగా కట్టు బొట్టుతో నెటిజన్స్‌ దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు.


ఆఫర్ల కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎదురు చూపులు

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఒకానొక సమయంలో ఫుల్‌ బిజీగా వరుస సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ఇండస్ట్రీలో కెరీర్‌ ముందుకు సాగడం కష్టంగా ఉంది. అయితే ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీ తక్కువేం కాదు. ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్లు రావడం లేదు కానీ, ఆమెకు అభిమానుల్లో ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు. ఆమె ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉందని అభిమానులు ఇప్పటికీ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆకట్టుకునే రూపంతో పాటు, సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న కారణంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాల్లో కాకున్నా అప్పుడప్పుడు యాడ్స్‌లో అయినా కనిపిస్తూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.

అఖండ 2 తో ప్రగ్యా జైస్వాల్‌ హిట్‌

ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. కంచె సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ లక్‌ కలిసి రాకపోవడంతో ఈమెకు ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్లు రాలేదు. ముఖ్యంగా యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కక పోవడంతో ఈ అమ్మడికి ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌, నటన ప్రతిభ ఉన్న ప్రగ్యా ముందు ముందు అయినా మరిన్ని మంచి ఆఫర్లు దక్కించుకుంటుందేమో అని ఆమె సన్నిహితులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఒకటి రెండు పెద్ద సినిమాలతో పాటు, కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రగ్యా జైస్వాల్‌ కు అఖండ 2 తో కలిసి వస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

బాలీవుడ్‌లోనూ మృణాల్‌ ఠాకూర్ బిజీ బిజీ

ఇక ఈ ఫోటోలో ఉన్న మరో ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీతారామం సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మృణాల్‌ ఠాకూర్‌ హాయ్‌ నాన్న సినిమాతో మరింత చేరువ అయింది. బాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా సినిమాలు చేస్తూ ఆఫర్ల కోసం ఎదురు చూస్తూ, హిట్‌ కోసం తాపత్రయ పడ్డ మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో మొదటి సినిమాతోనే హిట్‌ కొట్టడంతో మరిన్ని ఆఫర్లు వచ్చాయి. అంతే కాకుండా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సినిమాల కోసం కూడా ఈమెను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇంత బిజీగా ఉన్న ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు గణేష్ పూజ కోసం ఒక్క చోట చేరారు. ఈ కాలంలోనూ ఇంత పద్దతిగా, పవిత్రంగా గణేష్ పూజా కార్యక్రమాల్లో హీరోయిన్స్ కలిసి పాల్గొనడం నిజంగా గొప్ప విషయం అని, వీరిని అభినందించాల్సిందే అని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News