గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయినప్పుడు హీరో మాకు సహాయం చేశారా...!
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాతో జరిగిన నష్టాల గురించి మాట్లాడారు. మూవీ బిజినెస్ ఎంతో రిస్క్ తో కూడుకున్నదో అందరికీ తెలుసని అన్నారు.;
2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ బ్రదర్స్ దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించారు.
అయితే వేరే లెవెల్ అంచనాల మధ్య రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీనిపై ఇప్పటికే దిల్ రాజు పలుమార్లు స్పందించగా.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆయన సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాతో జరిగిన నష్టాల గురించి మాట్లాడారు. మూవీ బిజినెస్ ఎంతో రిస్క్ తో కూడుకున్నదో అందరికీ తెలుసని అన్నారు. ఎగ్జాంపుల్ కు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ తీసుకుంటే.. గేమ్ ఛేంజర్ తో తమ జీవితాలు అయిపోయాయమని అనుకున్నామని, కానీ సంక్రాంతికి వస్తున్నాం ఆశ కల్పించిందని తెలిపారు.
నాలుగు రోజుల గ్యాప్ లో బతుకులు మారిపోయాయని, ఆ మూవీ లేకపోతే తమ పరిస్థితి ఏంటో ఊహించుకోండని అన్నారు. తాము ఎవరికీ చెప్పుకోవాలని, ఎవరైనా హెల్ప్ చేస్తారా అని వ్యాఖ్యానించారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయినప్పుడు హీరో మాకు సహాయం చేశారా.. లేక దర్శకుడు ఏమైనా అండగా నిలిచారా అని అన్నారు.
కనీసం కర్టసీగా కూడా ఎలా ఉన్నారని క్వశ్చన్ చేయలేదని చెప్పారు. కానీ తాము ఎవరినీ నిందించడం లేదని, తామే ఇష్టపడి సినిమా తీశామని చెప్పారు. అందుకే నష్టాలను తామే ఎదుర్కొన్నామని చెప్పారు. పారితోషికాలు వెనక్కి అడిగే స్థాయికి ఎస్వీసీ బ్యానర్ ఇంకా దిగజారలేదని వ్యాఖ్యానించారు. పోతే తమదే పోయిందని, వస్తే తమకే వచ్చిందని స్పష్టం చేశారు.
అయితే రామ్ చరణ్ తో తమకు ఇప్పటికే సత్సంబంధాలే ఉన్నాయని శిరీష్ తెలిపారు. ఆయనకు మరో ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. దానికి ఒప్పుకోవడం, కాదనడం ఆయన ఇష్టమన్నారు. గేమ్ ఛేంజర్ వల్ల చాలా పోయిందని, సంక్రాంతికి వస్తున్నాం మూవీ ద్వారా 60-70 శాతం తిరిగి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.