సీరియ‌ల్స్ నుంచి హీరోగా నిఖిల్!

యంగ్ హీరో నిఖిల్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడు.;

Update: 2025-11-10 16:30 GMT

యంగ్ హీరో నిఖిల్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడు. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. `కార్తికేయ 2`తో పాన్ ఇండి యాలోనూ ఇమేజ్ సంపాదించాడు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు రొటీన్ సినిమాలు చేస్తోన్న స‌మ‌యంలో డిఫ‌రెంట్ ప్ర‌య‌త్నాలు చేసి స‌క్సెస అయిన న‌టుడు. న‌టుడుకు ఇమేజ్ అవ‌స‌రం లేద‌ని...క‌థే ఏ సినిమాకైనా ఇమే జ్ను తీసుకొస్తుంద‌ని ప్రూవ్ చేసిన హీరో. అందుకే ఎంత కాంపిటీష‌న్ ఉన్నా? నిఖిల్ కి మాత్రం ఏ హీరో పోటీ కాదు. త‌న స్టైల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.

నిఖిల్ జ‌ర్నీ మొద‌లైంద‌లా:

తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచుతున్నాడు. ఇక ప‌రిశ్ర‌మ‌లో నిఖిల్ ప్ర‌యాణం ఎలా మొద‌లైంది? అంటే? అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా అని అంతా చెబుతారు. `హ్యాపీడేస్` సినిమాలో న‌లుగురులో ఒక‌రిగా కాలేజ్ స్టూడెంట్ పాత్ర‌లో అల‌రించాడు. ఆ త‌ర్వాత సోలో ప్ర‌త్నాలు చేసి స‌క్స‌స్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా త‌న కున్న ప‌రిచ‌యాల‌తో ఇదంతా సాధ్య‌మైంది? అన్న‌ది వాస్త‌వం. అయితే ప‌రిశ్ర‌మ‌లో నిఖిల్ జ‌ర్నీ మొద‌లైంది అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కాదు. న‌టుడిగానే అని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని నిఖిల్ స్వ‌యంగా తెలిపాడు.

సీరియ‌ల్ తో ప‌రిచ‌య‌మై సినిమాల్లోకి:

తాను ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతోన్న స‌మ‌యంలో `చ‌ద‌రంగం` సీరియ‌ల్ లో న‌టించాడుట‌. న‌ట‌న‌పై త‌న‌కున్న ఆస‌క్తితో వ‌చ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకున్నాడు. దీంతో చాలా సీరియ‌ల్స్ లో అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే సీరియ‌ల్స్ లో కొన‌సాగితే సినిమాల్లోకి రావ‌డం ఆటంకంగా మారుతుంద‌ని భావించి ఆ ఛాన్సుల‌న్నీ వ‌దు లుకున్న‌ట్లు తెలిపాడు. ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న స‌మ‌యంలోనే సినిమా ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలిపాడు. దీంతో ఇంజ‌నీరింగ్ అనంత‌రం సీరియ‌ల్స్ వ‌దిలేసి సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేయ‌డం మొద‌లు పెట్టిన‌ట్లు తెలిపాడు.

వ‌చ్చే ఏడాది రెండు చిత్రాల‌తో:

ప్ర‌స్తుతం నిఖిల్ హీరోగా రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `స్వ‌యంభు` భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డుతున్నాయి. అలాగే `ది ఇండియా హౌస్` లో కూడా న‌టిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. వాస్త‌వానికి `స్వ‌యంభు` ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ డిలే తో వాయిదా ప‌డుతోంది. నిఖిల్ హీరోగా న‌టించిన `అప్పుడో ఇప్పుడో ఎప్పుడో `గ‌త ఏడాది రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News