"ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్"- సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!
వెబ్ సిరీస్ లలో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్న వారు ఎక్కువగా చరిత్రను సబ్జెక్టుగా ఎంచుకొని వెబ్ సిరీస్ చేస్తూ మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే.;
వెబ్ సిరీస్ లలో కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్న వారు ఎక్కువగా చరిత్రను సబ్జెక్టుగా ఎంచుకొని వెబ్ సిరీస్ చేస్తూ మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలిసిందే. అయితే ఆ స్వాతంత్ర్యం కోసం మన నాయకులు చేసిన త్యాగాలు ఏంటి? వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి ? ముఖ్యంగా ఆ సమయంలో వారు అనుభవించిన మానసిక ఒత్తిడి ఎలా ఉంది? అనే విషయాలను నేటితరం ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఆ నేటివిటీకి తగ్గట్టుగా గత ఏడాది నవంబర్లో రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ "ఫ్రీడం: ఎట్ మిడ్ నైట్". నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో ప్రసారమైన విషయం తెలిసిందే.
ఇందులో స్వాతంత్ర్యం కోసం మితవాదులు, అతివాదుల మధ్య విభజన ఎలా సాగింది? జిన్నా, గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నేతలకు కలిసొచ్చిన సంఘర్షణలేంటి? అనే అంశాలను చాలా చక్కగా చూపించారు. 1944 - 47 మధ్యకాలం నాటి సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆ కాలంనాటి ప్రాప్స్ , కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్ అన్ని అద్భుతంగా దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా చరిత్ర గురించి ఏ రేంజ్ లో రీసెర్చ్ చేసారో మనకు ఈ వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా మిగతావాదులు , అతివాదుల సిద్ధాంతాల మధ్య వచ్చే సన్నివేశాలను చాలా ఎమోషనల్ గా చూపించారు. చరిత్రపై ఆసక్తి ఉన్న వారికే కాదు మిగతా వారికి కూడా ఈ వెబ్ సిరీస్ చాలా బాగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.
ఇకపోతే గత ఏడాది వచ్చిన ఈ వెబ్ సిరీస్ కి సోనీ లివ్ లో మంచి ఆదరణ లభించింది. ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురుచూసిన అభిమానులకు వెబ్ సిరీస్ బృందం శుభవార్త తెలియజేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయడమే కాకుండా స్ట్రీమింగ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించింది.తాజాగా ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ లో జనవరి 9 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఇందులో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలను ఈ సీరీస్ ప్రస్తావించనుంది. చారిత్రక నగరమైన లాహోర్ ని ఎలా వదులుకున్నారు అనేది ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.