సినిమా ఫ్లాపైనా పాటలు హిట్… 'పౌర్ణమి' నుండి 'ఆరెంజ్' వరకు కల్ట్ మ్యూజిక్స్!
'పౌర్ణమి' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినా, అందులోని 'భారత వేదముగ' పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది.
మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. కొన్ని రిలీజ్ అయినప్పుడు భారీ డిజాస్టర్లుగా మిగిలిపోతాయి, కానీ అందులోని పాటలు మాత్రం ఏళ్ల తరబడి ప్రతి ఇంట్లో మోగుతూనే ఉంటాయి. 'పౌర్ణమి' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినా, అందులోని 'భారత వేదముగ' పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. అసలు సినిమా ఫ్లాప్ అయినా కొన్ని పాటలు ఎలా కల్ట్ క్లాసిక్స్‌గా మారతాయో, తెలుసుకుందాం..
కథకు అతీతంగా మనసును తాకే మ్యూజిక్:
సినిమా విజయం అనేది కథ, కథనం, స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏది తేడా కొట్టినా సినిమా ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ సంగీతానికి ఆ సరిహద్దులు ఉండవు. ఇక కథ బాగా లేకపోయినా, ఒక అద్భుతమైన ట్యూన్ మరియు మనసును కదిలించే లిరిక్స్ నేరుగా శ్రోతల హృదయాల్లోకి వెళ్ళిపోతాయి. జనాలు సినిమా ఫలితాన్ని మరచిపోయినా, ఆ పాట ఇచ్చిన అనుభూతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
8 ఏళ్ల వయసులోనే దేవిశ్రీ మ్యాజిక్:
'‘పౌర్ణమి’ ఆల్బమ్ గురించి గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్‌ను ‘మైండ్ బ్లాకింగ్’గా ప్రశంసిస్తూ, ఆయనను బాల మేధావిగా అభివర్ణించారు. చిన్నతనంలోనే చెన్నైలో మాండలిన్ శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందిన DSP, కేవలం 8 ఏళ్ల వయసులోనే ‘భారత వేదముగ’ పాట ట్యూన్‌ను కంపోజ్ చేసినట్లు తెలిపారు. ఈ పాట ఇప్పటికీ అంతర్జాతీయంగా ట్రెండ్ అవుతూ చైనా, జపాన్ కళాకారుల రీల్స్‌కు కూడా ప్రేరణగా నిలుస్తోంది.
లవ్ ఫెయిల్యూర్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ 'ఆరెంజ్':
రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' అప్పట్లో థియేటర్లలో కమర్షియల్ సక్సెస్ కాలేదు. కానీ హారిస్ జయరాజ్ అందించిన "ఓరెంజ్ లుక్ బుక్", "రోబా రోబా", "చిలిపిగా చూస్తూ", "నన్ను జాలిగా" పాటలు టాలీవుడ్ హిస్టరీలోనే ఒక క్లాసిక్‌గా నిలిచాయి. ఇక ఇప్పటికీ వాలెంటైన్స్ డే వచ్చినా లేదా లవ్ ఫెయిల్యూర్స్ పాటలు వినాలన్నా యూత్‌కు మొదటి ఛాయిస్ ఈ సినిమా పాటలే..
శివరాత్రి వస్తే మోగిపోవాల్సిందే.. 'ఖలేజా':
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఖలేజా' కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. కానీ మణిశర్మ అందించిన "సదా శివ సన్యాసి", "టాక్సీ టాక్సీ", "భూమ్ శకలక" పాటలు ఎప్పటికీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా "సదా శివ" పాట ప్రతి శివరాత్రికి, ఇన్స్టాగ్రామ్ భక్తి రీల్స్‌కు ఆల్ టైమ్ ట్రెండింగ్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తోంది.
సంగీతం ఎప్పటికీ శాశ్వతం:
బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలు తాత్కాలికం కానీ మంచి సంగీతం ఎప్పటికీ శాశ్వతం. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తమ అద్భుతమైన ఆల్బమ్స్‌తో కోట్ల మంది గుండెల్లో నిలిచిపోవడం ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కైనా దక్కే నిజమైన గౌరవం. ఇక సినిమా డిజాస్టర్ అయినా కళ ఎప్పటికీ చనిపోదనడానికి 'పౌర్ణమి', 'ఆరెంజ్', 'ఖలేజా' వంటి సినిమాలే ప్రత్యక్ష ఉదాహరణ.